కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా.. జీవీఎల్‌ రియాక్షన్‌ ఇదే

Gvl Narasimha Rao Reaction On Kanna Lakshminarayana Resignation - Sakshi

సాక్షి, అమరావతి: కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు స్పందించారు. కన్నాకు బీజేపీ సముచిత స్థానం కల్పిందన్నారు. సోము వీర్రాజుపై ఆయన వ్యాఖ్యలు సరికాదన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే కన్నా వ్యాఖ్యలు చేశారన్నారు. ‘‘అధిష్టానం చెప్పిన విధంగానే సోము వీర్రాజు నడుస్తున్నారు. ఆయన వ్యక్తిగతంగా ఏ నిర్ణయాలు తీసుకోలేదు. ఎంపీగా నా బాధ్యతకు లోబడే నేను పని చేశా’’ అని జీవీఎల్‌ పేర్కొన్నారు.

కాగా, బీజేపీ సీనియర్‌ నేత, ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. మీడియా సమావేశంలో తన రాజీనామాను ప్రకటించిన కన్నా.. సోము వీర్రాజుపై విమర్శలు గుప్పించారు.

రాష్ట్ర బీజేపీలో పరిణామాలు కలచివేస్తున్నాయని, సో​ము వీర్రాజు అధ్యక్షుడైన తర్వాత పార్టీ పరిస్థితులు మారాయని ఫైర్‌ అయ్యారు. పార్టీలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శలు గుప్పించారు. సోము వీర్రాజు వైఖరితోనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కన్నా తెలిపారు. జీవీఎల్‌పై కూడా లక్ష్మీనారాయణ పరోక్ష విమర్శలు చేశారు. ఓవర్‌ నైట్‌ నేత కావాలని కొందరు ప్రయత్నిస్తున్నారంటూ దుయ్యబట్టారు.
చదవండి: టీడీపీలో కల్లోలం.. కొనసాగుతున్న రాజీనామాల పర్వం  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top