ఎట్టకేలకు ఉత్కంఠకు తెర పడింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి.
సాక్షి, హైదరాబాద్ : ఎట్టకేలకు ఉత్కంఠకు తెర పడింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. జీహెచ్‌ఎంసీలోని 150 డివిజన్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ 56 డివిజన్లలో గెలుపొందింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీలు బల్దియా ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని హోరాహోరీగా ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే.
తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో విజయ ఢంకా మోగించి వరుస ప్రభంజనాలు సృష్టించిన టీఆర్‌ఎస్ పార్టీ.. ఇటీవల కాలంలో కేంద్రంలోని బీజేపీ నుంచి కొంత పోటీని ఎదుర్కొంటోంది. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 150 డివిజన్లకు గాను 99 డివిజన్లను దక్కించుకున్న టీఆర్‌ఎస్.. రాష్ట్ర రాజకీయాల్లో పట్టును నిలుపుకోవడానికి శతవిధాలా ప్రయత్నించినా 56 స్థానాలతో సరిపెట్టుకుంది.
ఇటు పాతబస్తీలో ఎదురులేని ఎంఐఎం.. గత ఎన్నికల్లో గెలిచిన 44 స్థానాలను నిలుపుకుంది. ఇటు గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో భాగంగా పోటీ చేసిన 68 డివిజన్లకు గాను కేవలం 4 స్థానాల్లో గెలిచిన బీజేపీ ఈసారి అనూహ్యంగా రెండో స్థానం దక్కించుకుంది. 48 డివిజన్లలో విజయం సాధించింది.
| వార్డువిజేతలు పార్టీ |
|||
| 1 | కాప్రా | స్వర్ణరాజ్ | టీఆర్‌ఎస్ |
| 2 | ఏఎస్ రావు నగర్ | శిరీషా రెడ్డి | కాంగ్రెస్ |
| 3 | చర్లపల్లి | బొంతు శ్రీదేవి | టీఆర్‌ఎస్ |
| 4 | మీర్‌పేట హెచ్‌బీ కాలనీ | జె.ప్రభుదాస్ | టీఆర్ఎస్ |
| 5 | మల్లాపూర్ | దేవేందర్‌రెడ్డి | టీఆర్ఎస్ |
| 6 | నాచారం | శాంతి సాయిజన్ | టీఆర్ఎస్ |
| 7 | చిలుకా నగర్ | గోనె శైలజ | బీజేపీ |
| 8 | హబ్సిగూడ | కె.చేతన | బీజేపీ |
| 9 | రామాంతపూర్ | బండారు శ్రీవాణి | బీజేపీ |
| 10 | ఉప్పల్ | రజిత | కాంగ్రెస్ |
| 11 | నాగోల్ | సిహెచ్ అరుణ | బీజేపీ |
| 12 | మన్సూరాబాద్ | కొప్పుల నరసింహారెడ్డి | బీజేపీ |
| 13 | హయత్‌నగర్ | కళ్లెం నవజీవన్ రెడ్డి | బీజేపీ |
| 14 | బీఎన్ రెడ్డి నగర్ | ఎం లచ్చిరెడ్డి | బీజేపీ |
| 15 | వనస్థలిపురం | వెంకటేశ్వర్ రెడ్డి | బీజేపీ |
| 16 | హస్తినాపురం | సుజాతా నాయక్ | బీజేపీ |
| 17 | చంపాపేట్ | వంగ మధుసూదన్ రెడ్డి | బీజేపీ |
| 18 | లింగోజీగూడ | ఆకుల రమేష్‌బాబు | బీజేపీ |
| 19 | సరూర్ నగర్ | ఆకుల శ్రీవాణీ | బీజేపీ |
| 20 | రామకృష్ణాపురం | రాధ | బీజేపీ |
| 21 | కొత్తపేట్ | పవన్ కుమార్ | బీజేపీ |
| 22 | చైతన్యపురి | నర్సింహ గుప్తా | బీజేపీ |
| 23 | గడ్డి అన్నారం | ప్రేమ్ మహేశ్వర్‌రెడ్డి | బీజేపీ |
| 24 | సైదాబాద్ | కె అరుణ | బీజేపీ |
| 25 | ముసారాంబాగ్ | భాగ్యలక్ష్మిరెడ్డి | బీజేపీ |
| 26 | ఓల్డ్ మలక్‌పేట్ | జువేరియా ఫాతిమా | ఎంఐఎం |
| 27 | అక్బర్‌బాగ్ | మినాజుద్దీన్ | ఎంఐఎం |
| 28 | అజాంపుర | అయేషా జహాన్ | ఎంఐఎం |
| 29 | చావని | అబ్దుల్ సలాం షాహిద్ | ఎంఐఎం |
| 30 | డబ్బీర్‌పురా | అలందార్ హుస్సేన్ | ఎంఐఎం |
| 31 | రైన్ బజార్ | వసీ యుద్దీన్ | ఎంఐఎం |
| 32 | పతర్ గట్టి | సొహైల్ ఖాద్రి | ఎంఐంఎం |
| 33 | మొఘల్‌పుర | నసరీన్ సుల్తానా | ఎంఐఎం |
| 34 | తలబ్ చంచలం | డా.సమీనా | ఎంఐఎం |
| 35 | గౌలీపురా | ఏ. భాగ్యలక్ష్మీ | బీజేపీ |
| 36 | లలితాబాగ్ | ఆలీ షరీఫ్ | ఎంఐఎం |
| 37 | కుర్మాగూడ | మహాపర | ఎంఐఎం |
| 38 | ఐఎస్ సదన్ | జె. శ్వేత | బీజేపీ |
| 39 | సంతోష్ నగర్ | ముజఫర్ హుస్సేన్ | ఎంఐఎం |
| 40 | రియాసత్ నగర్ | ముస్తఫా బేగ్ | ఎంఐఎం |
| 41 | కాంచనబాగ్ | రేష్మాఫాతిమా | ఎంఐఎం |
| 42 | బార్కాస్ | షబానా బేగం | ఎంఐఎం |
| 43 | చంద్రాయణగుట్ట | అబ్దుల్ వాహబ్ | ఎంఐఎం |
| 44 | ఉప్పుగూడ | ఆబ్దాద్ | ఎంఐఎం |
| 45 | జంగంమెట్ | ఎంఐఎం | |
| 46 | ఫలక్‌నుమా | తారాభాయ్ | ఎంఐఎం |
| 47 | నవాబ్ సాహెబ్ కుంట | షిరీన్ ఖాతూన్ | ఎంఐఎం |
| 48 | షహాలీబండ | ముస్తఫా అలీ | ఎంఐఎం |
| 49 | ఝాన్సీ బజార్ | ఫర్విన్ సుల్తానా | ఎంఐఎం |
| 50 | బేగంబజార్ | జి. శంకర్ యాదవ్ | బీజేపీ |
| 51 | గోషామహల్ | లాల్ సింగ్ | బీజేపీ |
| 52 | పురానాపూల్ | రాజ్ మోహన్ | ఎంఐఎం |
| 53 | దూద్ బౌలీ | ఎండీ సలీమ్ | ఎంఐఎం |
| 54 | జహానుమా | అబ్దుల్ ముక్తదీర్ | ఎంఐఎం |
| 55 | రాంనాస్తపుర | అబ్దుల్ ఖదీర్ | ఎంఐఎం |
| 56 | కిషన్‌బాగ్ | హుస్సేనీ పాషా | ఎంఐఎం |
| 57 | సులేమాన్ నగర్ | అబిదా సుల్తానా | ఎంఐఎం |
| 58 | శాస్త్రీపురం | మహ్మద్ ముబిన్ | ఎంఐఎం |
| 59 | మైలర్ దేవ్‌పల్లి | తోకల శ్రీనివాసరెడ్డి | బీజేపీ |
| 60 | రాజేంద్రనగర్ | పి. అర్చన | బీజేపీ |
| 61 | అత్తాపూర్ | ఎం. సంగీత | బీజేపీ |
| 62 | జియాగూడ | బి.దర్శన్ | బీజేపీ |
| 63 | మంగళ్‌హట్ | ఎం. శశికళ | బీజేపీ |
| 64 | దత్తాత్రేయ నగర్ | జాకీర్ బాకరి | ఎంఐఎం |
| 65 | కార్వాన్ | ఎం. స్వామి యాదవ్ | ఎంఐఎం |
| 66 | లంగర్ హౌస్ | అమీనా బేగం | ఎంఐఎం |
| 67 | గోల్కొండ | సమీనా యాస్మిన్ | ఎంఐఎం |
| 68 | టోలీచౌకీ | అయేషా ఉమేరా | ఎంఐఎం |
| 69 | ననల్ నగర్ | నసిరుద్దీన్ | ఎంఐఎం |
| 70 | మెహదీపట్నం | మాజిద్ హుస్సేన్ | ఎంఐఎం |
| 71 | గుడిమల్కాపూర్ | కర్ణాకర్ | బీజేపీ |
| 72 | అసిఫ్ నగర్ | గౌసియా సుల్తానా | ఎంఐఎం |
| 73 | విజయనగర్ కాలనీ | బి.జబీన్ | ఎంఐఎం |
| 74 | అహ్మద్ నగర్ | రఫత్ సుల్తానా | ఎంఐఎం |
| 75 | రెడ్ హిల్స్ | సద్దియా మజ్హర్ | ఎంఐఎం |
| 76 | మల్లేపల్లి | యాస్మిన్‌బేగం | ఎంఐఎం |
| 77 | జామ్‌బాగ్ | రాకేశ్ జైస్వాల్ | బీజేపీ |
| 78 | గన్‌ఫౌండ్రీ | బి. సురేఖ | బీజేపీ |
| 79 | హిమాయత్ నగర్ | జి.ఎన్.వి. కె. మహాలక్ష్మి | బీజేపీ |
| 80 | కాచిగూడ | కె. ఉమారాణి | బిజేపీ |
| 81 | నల్లకుంట | వై.అమృత | బీజేపీ |
| 82 | గోల్నాక | దూసరి | టీఆర్‌ఎస్ |
| 83 | అంబర్‌పేట్ | విజయ్ కుమార్‌గౌడ్ | టీఆర్‌ఎస్ |
| 84 | బాగ్ అంబర్‌పేట్ | బి. పద్మ వెంకటరెడ్డి | బీజేపీ |
| 85 | అడిక్‌మెట్ | సునీత | బీజేపీ |
| 86 | ముషీరాబాద్ | ఎం.సుప్రియ | బీజేపీ |
| 87 | రాంనగర్ | కె.రవికుమార్ | బీజేపీ |
| 88 | భోలక్‌పూర్ | మహ్మద్ గౌసుద్దిన్ | ఎంఐఎం |
| 89 | గాంధీనగర్ | పావని | బీజేపీ |
| 90 | కవాడిగూడ | జి. రచన శ్రీ | బీజేపీ |
| 91 | ఖైరతాబాద్ | విజయా రెడ్డి | టీఆర్‌ఎస్ |
| 92 | వెంకటేశ్వరా కాలనీ | మన్నె కవితా రెడ్డి | టీఆర్‌ఎస్ |
| 93 | బంజారహిల్స్ | విజయలక్ష్మీ | టీఆర్‌ఎస్ |
| 94 | షేక్‌పేట్ | మహ్మద్ ఫరాజుద్దీన్ | ఎంఐఎం |
| 95 | జూబ్లీహిల్స్ | డి. వెంకటేష్ | బీజేపీ |
| 96 | యూసఫ్‌గూడ | రాజ్‌కుమార్ | టీఆర్‌ఎస్ |
| 97 | సోమాజిగూడ | వనం సంగీత | టీఆర్‌ఎస్ |
| 98 | అమీర్‌పేట్ | సరళ | బీజేపీ |
| 99 | వెంగళరావు నగర్ | జి. దేదిప్య | టీఆర్‌ఎస్ |
| 100 | సనత్ నగర్ | కొలను లక్ష్మి | టీఆర్ఎస్ |
| 101 | ఎర్రగడ్డ | షాహిన్ బేగం | ఎంఐఎం |
| 102 | రహమత్ నగర్ | సి.ఎన్ రెడ్డి | టీఆర్‌ఎస్ |
| 103 | బోరబండ | బాబా ఫసియుద్దీన్ | టీఆర్ఎస్ |
| 104 | కొండాపూర్ | హమీద్ పటేల్ | టీఆర్ఎస్ |
| 105 | గచ్చిబౌలీ | గంగాధర్ | బీజేపీ |
| 106 | శేరిలింగంపల్లి | రాగం నాగేందర్ | టీఆర్‌ఎస్ |
| 107 | మాదాపూర్ | జగదీశ్వర్ గౌడ్ | టీఆర్‌ఎస్ |
| 108 | మియాపూర్ | ఉప్పలపాటి శ్రీకాంత్ | టీఆర్‌ఎస్ |
| 109 | హఫీజ్ పేట్ | పూజితా జగదీశ్వర్ | టీఆర్ఎస్ |
| 110 | చందానగర్ | ఆర్.మంజుల | టీఆర్‌ఎస్ |
| 111 | భారతీ నగర్ | వి.సింధు ఆదర్శ్‌రెడ్డి | టీఆర్ఎస్ |
| 112 | రామచంద్రాపురం | పుష్ప నగేష్ యాదవ్ | టీఆర్‌ఎస్ |
| 113 | పటాన్‌చెరువు | కుమార్ యాదవ్ | టీఆర్ఎస్ |
| 114 | కేపీహెచ్‌బీ కాలనీ | మందడి శ్రీనివాసరావు | టీఆర్‌ఎస్ |
| 115 | బాలాజీ నగర్ | శిరీష | టీఆర్ఎస్ |
| 116 | అల్లాపూర్ | సబీహా బేగం | టీఆర్ఎస్ |
| 117 | మూసాపేట్ | కె. మహిందర్ | బీజేపీ |
| 118 | ఫతే నగర్ | పండాల సతీష్ గౌడ్ | టీఆర్‌ఎస్ |
| 119 | ఓల్డ్ బోయన్ పల్లి | ఎం. నర్సింహా యాదవ్ | టీఆర్‌ఎస్ |
| 120 | బాలానగర్ | ఆవుల రవీందర్‌రెడ్డి | టీఆర్ఎస్ |
| 121 | కూకట్‌పల్లి | జూపల్లి సత్యనారాయణ | టీఆర్‌ఎస్ |
| 122 | వివేకానందనగర్ కాలనీ | మాధవరం రోజాదేవి | టీఆర్‌ఎస్ |
| 123 | హైదర్ నగర్ | నార్నె శ్రీనివాసరావు | టీఆర్‌ఎస్ |
| 124 | ఆల్వీన్ కాలనీ | డి. వెంకటేష్‌గౌడ్ | టీఆర్‌ఎస్ |
| 125 | గాజుల రామారం | రావూరి శేషగిరి | టీఆర్‌ఎస్ |
| 126 | జగద్గిరి గుట్ట | కొలుకుల జగన్ | టీఆర్ఎస్ |
| 127 | రంగారెడ్డి నగర్ | విజయ్‌శేఖర్ గౌడ్ | టీఆర్ఎస్ |
| 128 | చింతల్ | రషీదా బేగం | టీఆర్ఎస్ |
| 129 | సురారం | మంత్రి సత్యనారాయణ | టీఆర్‌ఎస్ |
| 130 | సుభాష్ నగర్ | జి. హేమలత | టీఆర్‌ఎస్ |
| 131 | కుత్బుల్లాపూర్ | కూన పారిజాత గౌరీష్‌గౌడ్ | టీఆర్‌ఎస్ |
| 132 | జీడిమెట్ల | తారా చంద్ర రెడ్డి | బీజేపీ |
| 133 | మచ్చ బొల్లారం | ఇ.ఎస్.రాజ్ జితేంద్రనాథ్ | టీఆర్‌ఎస్ |
| 134 | అల్వాల్ | శాంతి శ్రీనివాస్‌రెడ్డి | టీఆర్ఎస్ |
| 135 | వెంకటాపురం | సబితా కిషోర్ | టీఆర్ఎస్ |
| 136 | నేరేడ్‌మెట్ | ||
| 137 | వినాయక్ నగర్ | రాజ్యలక్ష్మీ | బీజేపీ |
| 138 | మౌలాలి | ఫాతిమా | టీఆర్‌ఎస్ |
| 139 | ఈస్ట్ ఆనంద్ బాగ్ | ప్రేమ్ కుమార్ | టీఆర్‌ఎస్ |
| 140 | మల్కాజ్ గిరి | వి. శ్రవణ్ | బీజేపీ |
| 141 | గౌతమ్ నగర్ | మేకల సునీత | టీఆర్‌ఎస్ |
| 142 | అడ్డగుట్ట | ఎల్ ప్రసన్న లక్ష్మి | టీఆర్‌ఎస్ |
| 143 | తార్నాక | ఎం. శ్రీలత | టీఆర్‌ఎస్ |
| 144 | మెట్టుగూడ | రాసూరి సునీత | టీఆర్‌ఎస్ |
| 145 | సీతాఫల్‌మండి | సామల హేమ | టీఆర్‌ఎస్ |
| 146 | భౌద్దనగర్ | కంది శైలజ | టీఆర్‌ఎస్ |
| 147 | బన్సీలాల్ పేట్ | కుర్మా హేమలత | టీఆర్‌ఎస్ |
| 148 | రాంగోపాల్ పేట్ | సీహెచ్ సచిత్ర | బీజేపీ |
| 149 | బేగంపేట్ | టి. మహేశ్వరి | టీఆర్‌ఎస్ |
| 150 | మోండా మార్కెట్ | దీపిక | బీజేపీ |


