సీఎం రేవంత్‌ ఇంటికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల | Gadwal MLA Bandla Krishna Mohan Meet CM Revanth | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్‌ ఇంటికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల

Aug 2 2024 9:13 AM | Updated on Aug 2 2024 11:50 AM

Gadwal MLA Bandla Krishna Mohan Meet CM Revanth

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మరోసారి రాజకీయం ఆసక్తికరంగా మారింది. కాసేపటి క్రితమే సీఎం రేవంత్‌ రెడ్డి నివాసానికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి చేరుకున్నారు. కాగా, నిన్న ఎమ్మెల్యే బండ్లతో మంత్రి జూపల్లి చర్యలు జరిపిన విషయం తెలిసిందే.

కాగా, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ మళ్లీ కాంగ్రెస్‌ గూటికి చేరుతున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్‌తో భేటీ అయినట్టు తెలుస్తోంది. అయితే, ఇటీవలే తాను తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరుతానంటూ బండ్ల కామెంట్స్‌ చేశారు. దీంతో, రంగంలోకి దిగిన మంత్రి జూపల్లి.. బండ్లతో చర్చ జరిపారు. ఈ క్రమంలోనే ఆయన మళ్లీ హస్తం పార్టీలోకి వస్తున్నట్టు సమాచారం.

 

Advertisement
 
Advertisement
Advertisement