దెబ్బకు బాబు, పవన్‌ మబ్బులు వీడిపోతాయి: కొడాలి నాని | Sakshi
Sakshi News home page

దెబ్బకు బాబు, పవన్‌ మబ్బులు వీడిపోతాయి: కొడాలి నాని

Published Fri, Jan 5 2024 3:45 PM

Former Minister Kodali Nani Comments On Tdp Bc Congregation  - Sakshi

సాక్షి,ఎన్టీఆర్‌: టీడీపీ బీసీ సదస్సుపై మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు గాలికి వదిలేసి ఇప్పుడు బీసీ భజన చేస్తానంటే ఎవరూ నమ్మరన్నారు. ఈ విషయమై కొడాలి నాని శుక్రవారం నాని మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్‌ను వెనకాల పెట్టుకుని తిరుగుతున్న చంద్రబాబు టీడీపీకి బీసీలు వెన్నెముక అని ఎలా చెప్తారని ప్రశ్నించారు. 

ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన కార్యక్రమాలను కొనసాగించడం తప్ప...బీసీల కోసం చంద్రబాబు కొత్తగా ఏం పాటు పడ్డాడో చెప్పాలని నాని నిలదీశారు. ఓసీలకు టికెటివ్వాల్సిన జనరల్‌ సీట్లలోనూ బీసీలకు పదవులు ఇస్తూ వారికి సీఎం జగన్ ప్రాధాన్యతనిస్తున్నారన్నారు.

సీఎం జగన్ నాలుగు రాజ్యసభ సీట్లు బీసీలకు ఇస్తే  25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో చంద్రబాబు ఒక్క బీసీ కైనా రాజ్యసభ సీటు ఇచ్చారా చెప్పాలన్నారు. విద్య, వైద్యాన్ని అందుబాటులోకి తేవడంతో పాటు బీసీల ఆర్థిక ఉన్నతికి సీఎం జగన్ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారని నాని చెప్పారు. రాబోయే ఎన్నికలలో చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడి మబ్బులన్నీ వీడిపోతాయన్నారు.

ఇదీచదవండి..చేనేత కార్మికుడి కానుక.. సీఎం జగన్‌ అభినందనలు

Advertisement
 
Advertisement