పవన్ నియోజవర్గంలో టీడీపీ, జనసేన బాహాబాహీ | Faceoff Between TDP And Janasena In Pithapuram | Sakshi
Sakshi News home page

పవన్ నియోజవర్గంలో టీడీపీ, జనసేన బాహాబాహీ

Jun 1 2025 6:29 PM | Updated on Jun 1 2025 6:29 PM

Faceoff Between TDP And Janasena In Pithapuram

పిఠాపురం:  టీడీపీ, జనసేనలు పొత్తు పరంగా కలిసి ఉన్నా, కార్యకర్తల  దగ్గరకు వచ్చే సరికి ఆ రెండు పార్టీల మధ్య సఖ్యత లేదనేది మరోసారి బయటపడింది. ఈరోజు(ఆదివారం, జూన్1)  డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో టీడీపీ, జనసేన మధ్య రగడ చోటు చేసుకుంది. పిఠాపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమాణ స్వీకారంలో టీడీపీ, జనసేన శ్రేణులు రెచ్చిపోయి మరీ ఒకరిపై ఒకరు వాగ్వాదానికి దిగారు.

పిఠాపురం జనసేన ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ సమక్షంలోనే ఇరు పార్టీల విభేదాలు బహిర్గతమయ్యాయి.  ఆ కార్యాక్రమానికి హాజరైన రెండు పార్టీల శ్రేణులు పోటా పోటీగా నినాదాలు చేసుకున్నారు. జై జనసేన, జై టీడీపీ అంటూ ఇరు వర్గాల నినాదాలు చేసుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇరు పార్టీల కార్యకర్తల్లో సఖ్యత అనేది లేకపోవడంతో ఏ కార్యక్రమం జరిగినా అక్కడ పరిస్థితులు గందరగోళానికి దారి తీసిన సందర్బాల్లో తరచు జరుగుతూనే ఉన్నాయి. 

ఇదీ చదవండి: 

పొత్తుపై పవన్ పునరాలోచన!.. వైరాగ్యమా.. వికారమా!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement