
పవన్ కళ్యాణ్‌కు అధికారం సంపాదించడంలో ఉన్నంత ఆరాటం.. నేడు ప్రజల కోసం చేస్తున్న పోరాటంలో కనిపించడంలేదు.. ఏదో చేసేద్దాం అనుకుని వచ్చాను.. ఏమీ చేయలేకపోతున్నానంటున్నారు. తనకు జ్ఞనోదయం అయిందా?. విషయం అవగతమైందా?. చంద్రబాబు నీడలో తన ఉనికి తనకే కనిపించక కళ్లు మసకలు.. బైర్లు కుమ్ముతున్నాయా తెలియని పరిస్థితుల్లో పవన్ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన తనలోని నైరాశ్యాన్ని నిర్వేదాన్ని వెళ్లగక్కారు..
వాస్తవానికి ఆయన ప్రభుత్వ పరంగా డిప్యూటీ సీఎం అయినప్పటికీ ఆయనకు ప్రభుత్వ నిర్ణయాలు.. పాలసీలతో సంబంధం లేకుండా పోతోంది. ఎంతసేపు లోకేష్‌ను ఎలివేట్ చేసి రేపు ఆయన్ను సీఎంగా తీర్చిదిద్దే పనిలో ఉన్న చంద్రబాబు పవన్ను జస్ట్ పెయిడ్ రౌడీ మాదిరిగా మాత్రమే వాడుకుంటూ పక్కన పెట్టేస్తున్నారు. అంటే పాత సినిమాల్లో సత్యనారాయణ జస్ట్ ఇలా చప్పట్లు కొట్టి జగ్గూ అనగానే పెద్ద కండలతో ఒక రౌడీ వచ్చి హీరో మీద దాడి చేస్తాడు కదా.. ఆ టైప్ పాత్రకు తనను వాడుకుంటున్నట్లు పవన్ గ్రహించారు.
ప్రభుత్వానికి ఇబ్బంది కలిగే పరిణామాలు ఎదురైనప్పుడు మాత్రమే తనను వాడుకుని ఆ తర్వాత పక్కన పెట్టేస్తున్న విషయం పవన్ గ్రహించారు.. అందుకే తన అసంతృప్తిని తాజాగా వెళ్లగక్కారు. తన 15 ఏళ్ల పాటు పొత్తులో ఉందామని అనుకున్నాను కానీ పరిస్థితులు చూస్తుంటే మాట మార్చాల్సి వచ్చేలా ఉందని చెప్పేశారు. రాష్ట్రంలో క్రైమ్ పెరిగిపోతుందని అంటూ అధికారులు ఇంకా ప్రభుత్వానికి సహకరించడం లేదని పవన్ నిందారోపణ చేశారు. వాస్తవానికి రాష్ట్రంలో అధికారం మొత్తం చంద్రబాబు.. లోకేష్ చేతిలో మాత్రమే ఉంది వారు చెప్తే తప్ప పూచిక పుల్ల కూడా కదలని పరిస్థితి.
ఆఖరికి తన పంచాయతీరాజ్ అటవీ శాఖల్లో కూడా పవన్ కళ్యాణ్ ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉంది. లోకేష్ చెబితే తప్ప పవన్ శాఖలో కూడా ఏమీ జరగడం లేదు. అంటే కేవలం తన ఇమేజ్ ద్వారా ఓట్లు కొల్లగొట్టిన చంద్రబాబు ఇప్పుడు తన కొడుకు లోకేష్ రాజకీయ భవిష్యత్తుకు పాటలు వేస్తున్నారు తప్ప తనకు ఏ రకమైన గౌరవ మర్యాదలు రాజకీయ ప్రాధాన్యం దక్కనివ్వడం లేదని పవన్ కళ్యాణ్ ఎప్పటికీ తన అంతరంగికుల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తుంది. తనను కేవలం ఓట్ల తెచ్చే యంత్రంగా వాడుకొని ఇప్పుడునట్లు లూజ్ చేసి పక్కన పడేస్తున్నారు అని పవన్ గ్రహించారు. అందుకే పొత్తుల విషయమై ఆయన బరస్ట్ అయినట్లుగా తెలుస్తుంది.
దీంతోపాటు రాష్ట్రంలో ఎక్కడ చూసినా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఆగడాలు రౌడీయిజం కూడా పవన్‌లో ఆగ్రహానికి కారణమైంది. రాజకీయ హత్యలు. అత్యాచారాలు సాధారణమైనాయి.. ఉద్యోగుల పట్ల కూడా తెలుగుదేశం నాయకులు అమర్యాదగా ప్రవర్తిస్తూ ప్రభుత్వాన్ని డిఫెన్స్‌లో పడేస్తున్నారు. వాస్తవానికి అధికరణకు వచ్చిన కొత్తల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను కక్ష పూర్తి రాజకీయాలు చేయబోనని.. వైఎస్ఆర్సిపి కార్యకర్తలపై దాడులకు తాను వ్యతిరేకం అని చెప్పారు. కానీ నేడు జరుగుతున్నది దానికి విరుద్ధంగా ఉన్నది. పల్లెలు పట్టణాలు గ్రామాల్లో తెలుగుదేశం నాయకులు పూర్తిగా ఆధిపత్యం సాధించే దిశగా వెళుతూ ఎక్కడికక్కడ వైఎస్సార్‌సీపీ కార్యకర్తల మీద దాడులు హత్యలకు పాల్పడుతున్నారు.
ఇదంతా పవన్ కళ్యాణ్ గమనించి తన అసంతృప్తిని ఇలా వెళ్లగక్కారని అంటున్నారు. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ సభలో మాట్లాడుతూ 30 వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారని ఆరోపించారు. నేడు అంతకుమించి దారుణాల జరుగుతున్నాయి దీనికి పవన్ సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉంది. అందుకే తాను 15 ఏళ్ల పాటు పొత్తులో ఉందామని అనుకున్న పరిస్థితులు అలా లేవంటూ ఇప్పుడు తాను పునర్ ఆలోచిస్తున్నట్లుగా ఆయన మాటలు చెబుతున్నాయి.
వచ్చే నాలుగేళ్లలో పవన్ పరిస్థితి ప్రభుత్వంలో మరింత దిగజారితే.. లోకేష్ ప్రాబల్యం ప్రాధాన్యం పెరిగితే అప్పుడు జనసేన ని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ప్రస్తుతం తనను డిప్యూటీ సీఎం హోదాలో ప్రోటోకాల్.. బుగ్గ కారు.. ఓ ఆఫీసు ఓ పదిమంది స్టాఫ్ మినహా ప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యం పాలసీల విషయంలో తన సంప్రదించకపోవడం వంటి అంశాలు పవన్ను ఇబ్బంది పెడుతున్నాయి. తనకు రాజకీయంగా జీరో నాలెడ్జ్ అని భావించడం వల్లనే చంద్రబాబు కూడా తనను చిన్నచూపు చూస్తున్నారని పవన్ లోలోన మదన పడుతున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఆయన మనసులోని ఆవేదనను ఈ విధంగా వెళ్లగక్కి చంద్రబాబుకు ఇండికేషన్ పంపించినట్లుగా జన సైనికులు భావిస్తున్నారు.
-సిమ్మాదిరప్పన్న