తొక్కిసలాట బాధ్యులపై క్రిమినల్‌ కేసులు పెట్టాలి: ఆర్కే రోజా | Ex Minister RK Roja Comments On Tirupati Stampede, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

తొక్కిసలాట బాధ్యులపై క్రిమినల్‌ కేసులు పెట్టాలి: ఆర్కే రోజా

Jan 9 2025 1:04 PM | Updated on Jan 9 2025 1:46 PM

Ex Minister Rk Roja Comments On Tirupati Stampede

టీటీడీ, విజిలెన్స్‌ అధికారుల నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగిందని.. ప్రభుత్వ బాధ్యతరాహిత్యానికి ఇది నిదర్శమని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు.

సాక్షి,తాడేపల్లి: టీటీడీ, విజిలెన్స్‌ అధికారుల నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగిందని.. ప్రభుత్వ బాధ్యతరాహిత్యానికి ఇది నిదర్శమని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. గురువారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల కోసం భక్తులకు ఏర్పాట్లు చేయలేదు. తొక్కిసలాట బాధ్యులపై క్రిమినల్‌ కేసులు పెట్టాలి. ఇంతమంది భక్తులు చనిపోతే పీఠాధిపతులు ఎటు వెళ్లారు?. సనాతన యోధుడు అని చెప్పుకున్న పవన్‌ స్పందన ఏది?. నిజమైన సనాతన యోధుడైతే బాధ్యులపై క్రిమినల్‌ కేసులు పెట్టాలి’’ అని డిమాండ్‌ చేశారు.

‘‘చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా చావులే. గతంలో కూడా చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే పుష్కరాల్లో తొక్కిసలాట జరిగింది. మృతుల కుటుంబాలకు రూ.2 కోట్ల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. టీటీడీ చరిత్రలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదు. చంద్రబాబు అసమర్థత, వైఫల్యం వల్లే తొక్కిసలాట జరిగింది. చంద్రబాబు అసమర్థ పాలనకు నిదర్శనంగా తిరుపతి ఘటన ఉంది. దీనికి ఎవరు బాధ్యులో తేల్చాలి’’ అని రోజా పేర్కొన్నారు.

‘‘పోలీసులను చంద్రబాబు సేవలో పెట్టారు. వచ్చిన భక్తులకు కనీసం సౌకర్యాలు కూడా కల్పించలేదు. ఇది ప్రభుత్వం చేసిన హత్యలే. అందరిపై క్రిమినల్ కేసులు పెట్టాలి. అల్లు అర్జున్‌కు సంబంధం లేకుండా తొక్కిసలాట జరిగితే ఆయనపై కేసు పెట్టారు. మరి తిరుపతి ఘటనలో చంద్రబాబు నుంచి బీఆర్ నాయుడు, ఎస్పీలపై కేసులు పెట్టాలి. 105 సెక్షన్ పెట్టాల్సి ఉండగా.. 194 సెక్షన్ ఎలా పెడతారు?. ఏడుగురు భక్తులు చనిపోతే.. హైందవ శంఖారావం నిర్వాహకులు ఏం చేస్తున్నారు?. ఆ పీఠాధిపతులు బయటకు రావాలి. చంద్రబాబు మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేయాలి. మోదీ కూడా దీనిపై స్పందించాలి. కూటమి ప్రభుత్వం వచ్చాక దారుణాలు జరుగుతున్నాయి. సనాతన యోధుడిని అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు?’’ అంటూ రోజా ప్రశ్నించారు.

ఇదీ చదవండి: తప్పు ఎవరి వల్ల జరిగింది?.. తొక్కిసలాటకు కారకులు ఎవరు?

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement