పార్లమెంటు ​‍ఆవరణలో వాటిపై నిషేధం.. విపక్షాలు గరం గరం

Dharna Strikes Not Allowed In Parliament Premises - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో సభ్యులు నిషేధిత పదాలు వాడరాదంటూ గురువారం జారీ చేసిన సర్క్యులర్‌పై వివాదం సమసిపోక మునుపే..శుక్రవారం జారీ చేసిన మరో బులెటిన్‌పై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ‘పార్లమెంటు ప్రాంగణాన్ని సభ్యులు ‘ధర్నా, సమ్మె, నిరాహార దీక్ష, ప్రదర్శన, ఏదైనా మతపరమైన కార్యక్రమాల నిమిత్తం వినియోగించుకోరాదు’ అంటూ రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ పీసీ మోదీ శుక్రవారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు. సమావేశాలు సవ్యంగా సాగేందుకు సభ్యులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

దీనిపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. పనికిమాలిన, పిరికిపంద ప్రభుత్వం ప్రజాస్వామ్యం గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోందని సీపీఎం నేత సీతారాం ఏచూరి విమర్శించారు. ‘విశ్వ గురు నుంచి మరో కొత్త ఆయుధం వచ్చింది. ఇక ధర్నాలపైనా నిషేధం’ అని కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ స్పందించారు.

చదవండి: Presidential election 2022: ముర్ముకు 61% ఓట్లు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top