చంద్రబాబు దళిత ద్రోహి: నారాయణ స్వామి

దళితుల సంక్షేమం గురించి చంద్రబాబు ఏనాడు పట్టించుకోలేదు
డిప్యూటీ సీఎం నారాయణస్వామి
సాక్షి, చిత్తూరు: దళిత ద్రోహి చంద్రబాబు అంటూ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దళితుల సంక్షేమం గురించి చంద్రబాబు ఏనాడు పట్టించుకోలేదన్నారు. దళితులపై దాడి జరిగితే కనీసం పరామర్శించని చంద్రబాబు.. దాడి చేయించిన దేవినేని ఉమ ఇంటికి వెళ్లడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు అగ్రవర్ణాల పక్షపాతి.. అది మరోసారి రుజువైందన్నారు. రాబోయే రోజుల్లో మరోసారి చంద్రబాబుకు దళితులు గుణపాఠం చెబుతారన్నారని నారాయణ స్వామి దుయ్యబట్టారు.