కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరానికి గాయాలు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పీ చిదంబరం(76) గాయపడ్డారు. సోమవారం రాహుల్ గాంధీ ఈడీ విచారణ సందర్భంగా.. ఢిల్లీలో జరిగిన పార్టీ నిరసనల్లో ఆయనకు గాయాలైనట్లు తెలుస్తోంది.
కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత పి.చిదంబరంను పోలీసులు తోసివేయడంతో ఆయన ఎడమ పక్కటెముకలో ఫ్రాక్చర్ అయ్యాయి. దీంతో ఆయన్ని ఆస్పత్రికి తరలించినట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి.
ఇదిలా ఉంటే.. మోదీ ప్రభుత్వం అనాగరికత ప్రతిపరిమితిని దాటిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ఓ ట్వీట్ చేశారు. మాజీ హోం మంత్రి పి చిదంబరాన్ని పోలీసులు కొట్టారు. ఆయన అద్దాలు నేలపై విసిరారు. ఎడమ పక్కటెముకలో హెయిర్‌లైన్ ఫ్రాక్చర్ అయ్యింది. ఎంపీ ప్రమోద్ తివారీని రోడ్డుపై పడేశారు. ఆయన తలకు గాయం కావడంతో పాటు పక్కటెముక ఫ్రాక్చర్ అయ్యింది. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే.. అంటూ సూర్జేవాలా ట్వీట్ చేశారు.
मोदी सरकार बर्बरता की हर हद पार कर गई।
पूर्व गृह मंत्री, श्री पी.चिदंबरम के साथ पुलिस की धक्कामुक्की हुई, चश्मा ज़मीन पर फेंका, उनकी बायीं पसलियों में हेयरलाइन फ्रैक्चर है।
सांसद प्रमोद तिवाड़ी को सड़क पर फेंका गया। सिर में चोट और पसली में फ्रैक्चर है।
क्या यह प्रजातंत्र है? pic.twitter.com/rRLOhIOTJ3
— Randeep Singh Surjewala (@rssurjewala) June 13, 2022