‘చలో రాజ్‌భవన్‌’ భగ్నం 

Congress Leaders Sent To The Begum Bazar Police Station By The TS Police - Sakshi

గాంధీభవన్‌ ముందే అడ్డుకున్న పోలీసులు

బేగంబజార్‌ పీఎస్‌కు కాంగ్రెస్‌ నేతల తరలింపు

సాక్షి, హైదరాబాద్‌: రాజస్తాన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూల్చివేతకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ, దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) చేపట్టిన ‘చలో రాజ్‌భవన్‌’కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. ఏఐసీసీ పిలుపు మేరకు సోమవారం రాజ్‌భవన్‌ వద్ద ధర్నా చేసేందుకుగాను పెద్దఎత్తున కాంగ్రెస్‌ కార్యకర్తలు గాంధీభవన్‌ చేరుకున్నారు. దేశంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలను బీజేపీ కూలదోస్తోందంటూ కాంగ్రెస్‌ శాసనసభాపక్షం (సీఎల్పీ) నేత మల్లు భట్టివిక్రమార్క, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డిల నేతృత్వంలో నిరసనకు దిగారు. గాంధీభవన్‌ బయట పోలీసులు పెద్దసంఖ్యలో మోహరించి ఉండటంతో నేతలు, కార్యకర్తలు గాంధీభవన్‌ ఆవరణలోనే చాలాసేపు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

బీజేపీకి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. వీరంతా రాజ్‌భవన్‌ వె ళ్లేందుకు బయలుదేరి గాంధీభవన్‌ వెలుపల కు రాగానే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్‌ నేతలు, పోలీసుల మధ్య కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు భట్టి, రేవంత్‌లతో పాటు మాజీ ఎంపీ వి.హనుమంతరావు, గ్రేటర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అంజన్‌కుమార్‌ యాదవ్, మల్లు రవి, యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ యా దవ్, పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, ఫిరోజ్‌ఖాన్, టి.కుమార్‌రావ్, హర్క ర వేణుగోపాల్, ప్రేమ్‌లాల్, కిషన్, ఉజ్మా షాకేర్‌ తదితరులను అదుపులోకి తీసుకుని బేగంబజార్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

సీఎం, డీజీపీలదే బాధ్యత...  
ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని దొడ్డిదారిన రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్ని స్తోందని విమర్శించారు. కర్ణాటక, మధ్యప్ర దేశ్‌ తరహాలోనే రాజస్తాన్‌లో కూడా ప్రజలె న్నుకున్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలదోయాలని ప్రయత్నిస్తూ ప్రజాస్వామ్యాన్ని అçపహాస్యం చేస్తున్నారన్నారు. దీన్ని నిరసి స్తూ తమ పార్టీ దేశమంతటా ఆందోళనలు చేస్తోందని, కానీ మన రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అడ్డుకోవడం దురదృష్టకరమన్నా రు. విపక్ష నేతలకు కేసీఆర్‌ కరోనాను అం టించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top