ప్రజాభవన్‌లో బీసీ నేతలతో సమావేశమైన సీఎం రేవంత్‌ | Telangana CM Revanth Reddy Meeting With BC Leaders In Praja Bhavan, Details Inside | Sakshi
Sakshi News home page

ప్రజాభవన్‌లో బీసీ నేతలతో సమావేశమైన సీఎం రేవంత్‌

Feb 22 2025 12:16 PM | Updated on Feb 22 2025 1:31 PM

CM revanth Meeting With BC Leaders In Praja Bhavan

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలోని బీసీ సంఘాలు, ఇతర ముఖ్య నేతలతో ప్రజా భవన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్, కాంగ్రెస్‌ సీనియర్‌ బీసీ నాయకులు, బీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, సెక్రటరీలు హాజరయ్యారు.

ఈ సమావేశం సందర్భంగా 42 శాతం బీసీ రిజర్వేషన్ల చట్టం కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు, తీర్మానం చేయడానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, బీసీల సంక్షేమానికి అమలుచేస్తున్న కార్యక్రమాలపైనా చర్చ జరిగే అవకాశం ఉంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement