
ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
సాక్షి, హైదరాబాద్: ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో శుక్రవారం బీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
నియోజకవర్గాల వారీగా కార్యక్రమాలు నిర్వహించాలని, ఎన్నికల్లో మళ్లీ బీఆర్‌ఎస్సే గెలుస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ‘‘డిసెంబర్‌లో జరిగే ఎన్నికలకు ప్లాన్ చేసుకోండి. అవసరమైన చోట యాత్రలు, పాదయాత్రలు నిర్వహించాలి’’ అని సీఎం కేసీఆర్ అన్నారు.
చదవండి: ఎమ్మెల్యే కాల్ చేసి బయటకు రమ్మంటున్నారు: తాటికొండ రాజయ్యపై మహిళా సర్పంచ్ సంచలన ఆరోపణలు