ఎస్సీ వర్గీకరణ: ‘సుప్రీం కోర్టు తీర్పును అప్పీల్‌ చేస్తాం’ | chirag paswan says review on SC ST Sub Classification Order | Sakshi
Sakshi News home page

ఎస్సీ వర్గీకరణ: ‘సుప్రీం కోర్టు తీర్పును అప్పీల్‌ చేస్తాం’

Aug 4 2024 7:25 AM | Updated on Aug 4 2024 7:35 AM

chirag paswan says review on SC ST Sub Classification Order

ఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణకు సంబంధించి ఇటీవల  సుప్రీంకోర్టు రాష్ట్రాలకు అనుమతిస్తూ  తీర్పు వెల్లడించింది. అయితే తీర్పును దేశ వ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు, నేతలు స్వాగతించారు. సుప్రీం కోర్టు తీర్పుపై స్పందించిన ‘లోక్‌ జనశక్తి పార్టీ’ (రాంవిలాస్‌) నేత, కేంద్ర మంత్రిమంత్రి చిరాగ్ పాశ్వాన్  మాత్రం వర్గీకరణను వ్యతిరేకించారు. అదీకాక సుప్రీం కోర్టు తీర్పును సర్వొన్నత న్యాయస్థానంలోనే అప్పీలు చేయనున్నామని అన్నారు. ఆయన శనివారం  ఢిల్లీలో మీడియాతో  మాట్లాడారు.

‘‘అంటరానితనాన్ని ప్రాతిపదికగా తీసుకుని అణగారినవర్గాలను షెడ్యూల్డ్ కేటగిరీలో చేర్చారు. అయితే  ఎస్సీ, ఎస్టీలో ఉప వర్గీకరణ వల్ల ఎటువంటి ప్రయోజనం జరగదు. ఈ వర్గాలు ఎదుర్కొన్నే  అంటరానితనం అనే విషయాన్ని సుప్రీంకోర్టు తీర్పులో ఎక్కడా ప్రస్తవించలేదు. విద్యాఅవకాశాలు ఉన్న దళితులు, ధనవంతులు సైతం ఎస్సీల్లో పలు వర్గాలు ఇప్పటికీ కొన్నిచోట్ల అంటరానితనాన్ని ఎందుర్కొంటున్నారు. అందుకే ఎస్సీ, ఎస్టీ ఉపవర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వటం సరికాదు.  ఈ తీర్పును సమీక్షించి, సుప్రీం కోర్టులోనే అప్పీలు చేయనున్నాము’అని చిరాగ్‌ అ‍న్నారు.

 

అదేవింధంగా దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాల్సిన అవసరం ఉందని మరోసారి స్పష్టం చేశారు. కులగణనకు సంబంధించిన వివరాలను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదన్నారు. దళితుల కోటాలో క్రీమీలేయర్‌ను తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందనని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement