అమిత్‌ షాతో చంద్రబాబు భేటీపై మంత్రి బొత్స సెటైరికల్‌ పంచ్

Botsa Satyanarayana Comments Over Elections In AP - Sakshi

సాక్షి, విజయవాడ: ఏపీలో ఎంత మంది ఎక్కడ తిరిగినా ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైపే ఉ‍న్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, నారా లోకేశ్‌ ఎవరు ఎక్కడ తిరిగినా మాకు నష్టం లేదు అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 

కాగా, మంత్రి బొత్స గురువారం మీడియాతో మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా అందించిన సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాయి. ఏపీలో షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి. ముందస్తు అంటూ వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. చంద్రబాబు ఎవరితోనైనా కలుస్తారు. చంద్రబాబు ఎవరితో కలిసినా మాకు నష్టం లేదు. ప్రతిపక్షం‌ ఉనికిని కాపాడుకోవడానికే టీడీపీ నేతలు గవర్నర్‌ని కలిశారు. చంద్రబాబు ఈరోజు అమిత్ షాని కలుస్తారు.. ‌రేపు అబితాబ్ బచ్చన్‌ను‌ కలుస్తారు. ఆయన ఎవరితో కలిస్తే మాకేంటి.

రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం ఎక్కడ కలిగింది. తప్పుడు ఫిర్యాదులు చేయడం టీడీపీ దినచర్యలో భాగం. నాలుగుపక్కల నలుగురు తిరుగుతున్నారు. ఎవరెక్కడ తిరిగితే మాకేంటి. మేము అమలు చేస్తున్న సంక్షేమ పధకాలతో‌ ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇచ్చిన వాగ్దానాలు అన్నింటిని నెరవేర్చాం. 99 శాతం నెరవేర్చాం.. మళ్లీ అధికారంలోకి వస్తాం. ఉద్యోగులకి జీపీఎస్ ద్వారా న్యాయం జరుగుతుంది. ఉద్యోగులకి ఆమోదయోగ్యమైన నిర్ణయాలే తీసుకున్నాం. సీపీఎస్ రద్దుపై ఇతర రాష్ట్రాలు మాటలకే పరిమితమయ్యారు. ఏ రాష్ట్రంలో అమలు చేశారు? అని కామెంట్స్‌ చేశారు.  

ఇది కూడా చదవండి: ఏపీలో ఈనెల 12 నుంచి పాఠశాలలు పున:ప్రారంభం 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top