అసత్య ప్రచారంపై ఏపీ మంత్రి బొత్స ఫైర్‌ | Botsa Satyanarayana Key Comments On Fake News Against AP Education System - Sakshi
Sakshi News home page

విద్యా వ్యవస్థలో మార్పులపై అసత్య ప్రచారం.. మంత్రి బొత్స ఫైర్‌

Published Fri, Oct 20 2023 1:45 PM

Bosta Satyanarayana Key Comments Over AP Education System - Sakshi

సాక్షి, విజయవాడ: ఏపీలో విద్యా వ్యవస్థలో మార్పులపై అసత్య ప్రచారం చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు . విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నాం. ప్రభుత్వం మంచి చేస్తుంటే ప్రతిపక్ష నేతలు తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. 

కాగా, మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘పేదవాళ్లు పేదవాళ్లుగానే ఉండాలనేది ప్రతిపక్షాల భావన. ఏపీ విద్యార్థులు ప్రపంచస్థాయిలో పోటీ పడాలనేదే మా లక్ష్యం. విద్యావ్యవస్థలో పెను మార్పులు తీసుకొస్తున్నాం. విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్‌లు ఓపెన్‌ టెండర్‌ ద్వారానే తీసుకున్నాం. విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి కృషి చేస్తున్నాం’ అని తెలిపారు. 

ఇది కూడా చదవండి: ‘బాబు బాధలో ఉంటే బాలకృష్ణ మూవీ రిలీజ్‌ చేస్తారా’

Advertisement
 
Advertisement
 
Advertisement