​కేసీఆర్‌పై ఈడీ కేసు? | BJP MP Raghunandan Rao Sensational Comments On KCR, More Details Inside | Sakshi
Sakshi News home page

​కేసీఆర్‌పై ఈడీ కేసు?

Published Thu, Jun 13 2024 4:18 PM | Last Updated on Thu, Jun 13 2024 5:27 PM

Bjp Mp Raghunandan Rao Sensational Comments On Kcr

సాక్షి, మెదక్‌: మాజీ సీఎం  కేసీఆర్‌ కోసం ఈడీ అధికారులు వచ్చారంటూ మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన సన్మాన సభలో మాట్లాడుతూ.. కాసేపటి క్రితం కేసీఆర్‌పై ఈడీ కేసు నమోదు చేసింది. కేసీఆర్‌, హరీశ్‌రావు, వెంకట్రామిరెడ్డిలకు ముందుంది ముసళ్ల పండగ. గొర్రెల స్కాంలో కేసీఆర్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది’’ అంటూ వ్యాఖ్యానించారు.

‘‘రఘునందన్ గెలిస్తే మా పేరు ఢిల్లీకి వినిపిస్తుందని చాలా మంది కష్టపడ్డారు. జీవిత కాలం మెదక్ ప్రజలకు రుణపడి ఉంటా. ర్యాక్ పాయింట్ ఏర్పాటుకు కృషి చేస్తా. మీ గొంతుకగా పార్లమెంట్‌లో కొట్లాడతా. రఘునందన్ మాటల మనిషి కాదు.. చేతల మనిషి. మీరు ఏ ఆపదలో ఉన్న  రఘునందన్ ఉంటాడు’’ అని ఆయన చెప్పారు.

వెంకట్రామిరెడ్డి వెయ్యి కోట్లు పెడితే వాటిని లెక్కచేయకుండా గెలిచాం. మాజీ సీఎం కేసీఆర్ మీద కొద్దిసేపటి క్రితం ఈడి వచ్చింది. దుబ్బాకలో దెబ్బ కొట్టిన అని ఆరడుగుల హరిశ్ ఎగిరిండు. లక్ష్యాన్ని నిర్దేశించుకొని క్యాడర్ ముందుకు సాగాలి. జనం గుండెల్లో ఉన్నాం కాబట్టి గెలిచాం. చాయ్‌ అమ్మిన నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయ్యారు’’ అని రఘునందన్‌ అన్నారు.

కేసీఆర్ పై ఈడి కేసు నమోదు రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement