బీజేపీ అధ్యక్షుడి ఎంపిక.. రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు | BJP MLA Raja Singh Sensational Comments | Sakshi
Sakshi News home page

బీజేపీ అధ్యక్షుడి ఎంపిక.. రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు

Jun 30 2025 11:29 AM | Updated on Jun 30 2025 11:41 AM

BJP MLA Raja Singh Sensational Comments

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో బీజేపీలో కోల్డ్‌ వార్‌ నడుస్తోంది. బీజేపీ అధ్యక్షుడి నియామకంపై కాషాయ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ హైకమాండ్‌ను టార్గెట్‌ చేసి రాజాసింగ్‌ విమర్శలు గుప్పించారు.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌ రావును అధిష్టానం ఖరారు చేసింది. ఈ క్రమంలో​ బీజేపీ ఎమ్మెల్సీ రాజాసింగ్‌ స్పందించారు. రాజాసింగ్‌ మాట్లాడుతూ..‘రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక వ్యక్తిని అధిష్ఠానం నిర్ణయించినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర అధ్యక్షుడిని బూత్‌ కార్యకర్త నుంచి ముఖ్య నేత వరకు ఓటు వేసి ఎన్నుకోవాలి. అంతేకానీ, పార్టీలో మావాడు, మీవాడు అంటూ నియమించుకుంటూ పోతే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే కచ్చితంగా ఎన్నిక నిర్వహించాలి’ అని డిమాండ్‌ చేశారు. 

ఇదిలా ఉండగా.. అంతకుముందు కూడా రాజాసింగ్‌ ఓ వీడియో విడుదల చేసి ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ఈ వీడియోలో రాజాసింగ్‌.. ‘నన్ను అధ్యక్షుడిగా చూడాలని చాలా మంది కార్యకర్తలు ఫోన్లు చేస్తున్నారు. అందుకే నాకో అవకాశం ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరుతున్నా. నన్ను నియమిస్తే.. పార్టీలో గోరక్షణ విభాగాన్ని ఏర్పాటు చేస్తా. గోరక్షణకు పాటుపడే కార్యకర్తలకు రక్షణగా నిలబడతా. బీజేపీ అవసరాన్ని గడపగడపకు చాటిచెబుతా.  ఎన్నికలకు ఆర్నెల్ల ముందే అభ్యర్థులను ప్రకటిస్తాం. అధ్యక్ష పదవి ఎవరికిచ్చినా అభ్యంతరం లేదు. వీఐపీలా ఉండే వారు కాకుండా.. హిందుత్వం కోసం పనిచేసే వ్యక్తినే నియమిస్తే బాగుంటుంది. రాజాసింగ్‌ అధ్యక్షుడు కావొద్దని అడ్డుకునే ఒక బృందం పనిచేస్తోంది’ అంటూ ఆరోపణలు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement