'కేంద్రాన్ని అడిగి అమరావతిని ఎంపిక చేయలేదు'

BJP Leader Vishnu Vardhan Fires On Chandrababu In Viajyawada - Sakshi

సాక్షి, విజయవాడ : అమరావతితో సంబంధం లేకపోయినా బీజేపీని ముద్దాయి చేయాలని కొన్ని పార్టీలు చూస్తున్నాయంటూ బీజేపీ ఉపాధ్యాక్షుడు విష్ణువర్దన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం విజయవాడలో మీడియాలో మాట్లాడుతూ.. ' ప్రభుత్వం వేరు.. బీజేపీ వేరు. అయినా చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో చర్చించి అమరావతిని ఎంపిక చేయలేదు. రాజధానిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంగానే అమరావతిని కేంద్రం ప్రభుత్వం ఆమోదించింది. ఆరోజు అమరావతిని ఆమోదించినటప్పుడు కేంద్ర ప్రభుత్వం చంద్రబాబుకు మంచిదా కాదా అనేది తెలుపుకుంటే బాగుండేది. ఇప్పుడు పనిగట్టుకొని కొంత మంది మిడిమిడి జ్ఙానంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు అమరావతిపై లేఖలు రాస్తున్నారు. గల్లా జయదేవ్, కేశినేని నాని పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాజధాని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా సమాధానం చెప్పింది. (‘ఆశా కార్యకర్తలపై కేంద్రం గుడ్డిగా వ్యవహరిస్తోంది’)

బీజేపీ నేతలు కర్నూల్‌లో హైకోర్టు పెట్టమని చంద్రబాబును అడిగితే ఆయన మాత్రం అమరావతిలో పెట్టారు. పెడరల్ స్ఫూర్తిని గౌరవించి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు అమరావతిలో హై కోర్టు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకొంది. రైతుల పక్షాన బీజేపీ నిలబడతుంది.రాష్ట్ర ప్రభుత్వం రాజధాని రైతులతో చర్చలు జరపాలి. చంద్రబాబు, లోకేష్ జూమ్ లో నేతలతో మాట్లాడుతున్నారు. ఏదైనా ఉంటే చంద్రబాబు, లోకేష్ లు హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చి మాట్లాడాలి. రాష్ట్రంలో బీజేపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీలు పేరుకు వేరైనా.. స్క్రిప్ట్‌ మాత్రం టీడీపీదే. చంద్రబాబు ఉదయం మాట్లాడిందే సాయంత్రం కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నేతలు మాట్లాడుతున్నారు. గతంలో మోడీని చంద్రబాబు గో బ్యాక్ అన్నారు.. నేడు కంబ్యాక్ అంటున్నారు. సీబీఐ రాష్ట్రంలో అడుగుపెట్టానికి చంద్రబాబు వీల్లేదన్నారు..చిరంజీవి బీజేపీలోకి వస్తామంటే తప్పకుండా స్వాగతిస్తాము. ' అంటూ విష్ణువర్దన్‌ తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top