మరో ఏడుగురికి బీజేపీ టికెట్లు!

BJP has finalized seven candidates for Assembly Elections - Sakshi

అధికారికంగా ప్రకటించకుండా ఫోన్‌లో సమాచారం 

నామినేషన్లు వేసుకోవాలని సూచించిన నేతలు 

ఇంకా ఐదు సీట్లకు అభ్యర్థుల ఖరారు పెండింగ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: పెండింగ్‌లో ఉన్న నియోజకవర్గాలకు సంబంధించి బీజేపీ ఏడుగురు అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే అధికారికంగా జాబితా విడుదల చేయలేదు. బీజేపీ నాయకత్వం ఆయా అభ్యర్థులకు ఫోన్లు చేసి పార్టీ తరఫున నామినేషన్లు వేసుకోవాల్సిందిగా సూచించింది. దీనితో ఇప్పటివరకు 106 మందిని ప్రకటించినట్టు అయింది. మరో ఐదు సీట్లకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. మిగతా 8 స్థానాలను పొత్తులో భాగంగా ఇప్పటికే జనసేనకు కేటాయించారు. 

కీలక స్థానాలకు ఎంపిక 
శేరిలింగంపల్లి నుంచి మాజీ ఎమ్మెల్యే భిక్షపతియాదవ్‌ కుమారుడు రవికుమార్‌ యాదవ్‌ పేరు ఖరారైంది. నిజానికి ఈ సీటుకోసం జనసేన ప్రయత్నం చేసింది. కానీ తనకు సంబంధించిన చేవెళ్ల లోక్‌సభ స్థానం పరిధిలోని కీలకమైన సీటు కావడంతో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పట్టుబట్టి  రవికుమార్‌ యాదవ్‌కు ఇప్పించుకున్నారు. ఇక మల్కాజిగిరిలో మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావుకు.. పెద్దపల్లిలో పార్టీ ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్‌కు టికెట్లు ఇచ్చారు.

సంగారెడ్డి నుంచి పులిమామిడి రాజు, నాంపల్లి నుంచి రాహుల్‌చంద్ర, కంటోన్మెంట్‌ నుంచి రిటైర్డ్‌ ఐపీఎస్‌ కృష్ణప్రసాద్‌ల పేర్లు ఖరారైనట్టు తెలిసింది. ఇంకా నర్సంపేట, మధిర, అలంపూర్, దేవరకద్ర, చాంద్రాయణగుట్ట సీట్లకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. చాంద్రాయణగుట్ట అభ్యరి్థగా సత్యనారాయణ ముదిరాజ్‌ పేరును ఇంతకుముందే ప్రకటించినా.. అనారోగ్య కారణాలతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. శుక్రవారం నామినేషన్ల దాఖలుకు చివరితేదీ కావడంతో.. ఈ ఐదు సీట్లకు వెంటనే అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. 

నేడు నామినేషన్లు.. ప్రచార సభల్లో కేంద్రమంత్రులు 
శుక్రవారం బీజేపీ అభ్యర్థుల నామినేషన్లు, ప్రచార సభల్లో పలువురు కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు. వరంగల్‌లో కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్, చేవెళ్లలో బీఎల్‌ఎన్‌ వర్మ, కొల్లాపూర్‌లో పురుషోత్తం రూపాలా తదితరులు పర్యటించనున్నారు. ఈ నెల 13 నుంచి 27 వరకు జరిగే బీజేపీ ఎన్నికల ప్రచార సభలు, కార్యక్రమాల్లో ప్రధాని మోదీ, అమిత్‌షా, నడ్డాలతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, సీనియర్‌ నేతలు పాల్గొంటారని బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్‌ తెలిపారు.  

టికెట్‌ ఖరారు సమాచారం అందిన నేతలు 
నియోజకవర్గం    అభ్యర్థి 
1.మల్కాజిగిరి    రాంచందర్‌రావు 
2.మేడ్చల్‌        విక్రమ్‌రెడ్డి 
3.పెద్దపల్లి        దుగ్యాల ప్రదీప్‌రావు 
4.శేరిలింగంపల్లి    రవికుమార్‌ యాదవ్‌ 
5.నాంపల్లి        రాహుల్‌ చంద్ర 
6.కంటోన్మెంట్‌    కృష్ణప్రసాద్‌ 
7.సంగారెడ్డి        పులి మామిడి రాజు  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

23-11-2023
Nov 23, 2023, 12:50 IST
సాక్షి, మహబూబ్‌నగర్‌: నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన కర్నె శిరీష అలియాస్‌ బర్రెలక్కకు ప్రముఖుల నుంచి మద్దతు పెరుగుతుంది. ఎన్నికల...
23-11-2023
Nov 23, 2023, 12:24 IST
నిర్మల్‌ ఖిల్లా: ప్రస్తుతం శాసనసభ ఎన్నికల సమరం కొనసాగుతోంది. మరోవారం రోజుల్లో పోలింగ్‌ ఉండడంతో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టే...
23-11-2023
Nov 23, 2023, 12:17 IST
సాక్షి, తెలంగాణ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగిసింది. గులాబీ పార్టీ అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేశారు. అన్ని...
23-11-2023
Nov 23, 2023, 11:53 IST
తాండూరు: ఏమ్మా.. మీ ఎమ్మెల్యేను ఈ సారి గెలిపిస్తారా? అని సీఎం కేసీఆర్‌ తాండూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్నపరిమళ్‌ను ప్రశ్నించారు....
23-11-2023
Nov 23, 2023, 11:46 IST
సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయా లని ఆశించి టికెట్‌ రాక భంగపడిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతలను ఏఐసీసీ...
23-11-2023
Nov 23, 2023, 11:39 IST
వికారాబాద్: మండల పరిధిలోని గ్రామాల్లో కారు, హస్తం నేతలు హోరాహోరీ ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ నాలుగు ప్రధాన పార్టీల అభ్యర్థులు...
23-11-2023
Nov 23, 2023, 10:05 IST
మహబూబ్‌నగర్‌: చిచ్చా బాగున్నావా.. మావా ఎక్కడ పోతున్నావ్‌.. ఓ అక్కా నీ బిడ్డ మంచిగ చదువుతుండా.. మొన్న వడ్లు ఎన్ని...
23-11-2023
Nov 23, 2023, 10:01 IST
నాకు ఇవే చివరి ఎన్నికలట. జగిత్యాలకు నేనేం చేయలేదట. మరి అభివృద్ధి విషయంలో.. 
23-11-2023
Nov 23, 2023, 09:55 IST
సాక్షి, మెదక్‌: రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా ఏడు రోజులే గడువు ఉంది. అయితే 48 గంటల ముందే ప్రచారాన్ని నిలిపివేయాలి దీంతో...
23-11-2023
Nov 23, 2023, 09:47 IST
ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. మరోవైపు ప్రధాన పార్టీలు.. 
23-11-2023
Nov 23, 2023, 09:38 IST
సాక్షి, మహబూబ్‌నగర్‌: ఎన్నికల ప్రచారంలో ప్రతిసారి వినూత్న మార్పులు కనిపిస్తున్నాయి. నాడు అభ్యర్థులు కాలినడకన గ్రామాలను చుట్టేసేవారు. ఆ తర్వాత ఎడ్లబండ్లు,...
23-11-2023
Nov 23, 2023, 08:41 IST
సాక్షి, మహబూబ్‌నగర్‌: ప్రజలు అసెంబ్లీ ఎన్నికల యుద్ధానికి సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్మన్‌ విజయశాంతి అన్నారు. రాష్ట్రంలో దొరను...
23-11-2023
Nov 23, 2023, 07:48 IST
సాక్షి, ఆదిలాబాద్‌: 'జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం. ఈవీఎంలు, ఎన్నికల అధికారుల ర్యాండమైజేషన్‌ను పూర్తి చేసి...
23-11-2023
Nov 23, 2023, 04:10 IST
సాక్షి ప్రతినిధులు, మహబూబ్‌నగర్‌/నల్లగొండ: ‘తెలంగాణలో మీరు అనుకున్న అభివృద్ధి జరగలేదు. ఇక్కడి సీఎం కేసీఆర్‌ ఫాంహౌస్‌లో కూర్చుని నిర్ణయాలు తీసుకుంటున్నారు....
23-11-2023
Nov 23, 2023, 04:00 IST
సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ తర్వాత మూడు వేర్వేరు సంస్థల ద్వారా లోతుగా సర్వే చేశామని.. బీఆర్‌ఎస్‌కు...
23-11-2023
Nov 23, 2023, 03:54 IST
సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రానందునే వివిధ పథకాలు ఆలస్యం అయ్యాయని సీఎం కేసీఆర్‌ చెబుతున్న మాటలు...
23-11-2023
Nov 23, 2023, 03:45 IST
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌/వికారాబాద్‌: ఎన్నికలు వచ్చాయంటే రకరకాలుగా ఆగం చేసే పనులు జరుగుతాయని.. ఒక్కసారి కాంగ్రెస్‌ను నమ్మి మోసపోతే ఐదేళ్లపాటు...
22-11-2023
Nov 22, 2023, 15:42 IST
ప్రధాన పార్టీలేమో వ్యూహాత్మక ఎత్తుగడల నడుమ కీలక నేతల పోరు తెలంగాణ ఎన్నికలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి.
22-11-2023
Nov 22, 2023, 13:41 IST
కాంగ్రెస్‌ పార్టీ వల్లే బీజేపీ గెలుస్తోందని.. గాంధీభవన్‌ రిమోట్‌ ఆరెస్సెస్‌ చీఫ్‌ చేతిలో.. 
22-11-2023
Nov 22, 2023, 13:23 IST
నిర్మల్‌:‘రాజకీయాలన్నాక ఇవన్నీ కామన్‌ తమ్మీ..’ ఓ సినిమాలో డైలాగ్‌ ఇది. ఈ మాట కూడా వాస్తవమే. రాజకీయాల్లో ఎప్పుడు ఏం... 

Read also in:
Back to Top