
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్(Jubilee Hills Election) బీజేపీ అభ్యర్థి ప్రకటన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు(Ramchander Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ(BJP Party) అభ్యర్థి ప్రకటన ఈరోజు సాయంత్రం కానీ.. రేపు(మంగళవారం) ఉండే అవకాశం ఉందన్నారు. ఇదే సమయంలో జూబ్లీహిల్స్‌లో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అలాగే, జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం పార్టీ గెలవాలని వారి అభ్యర్థిని కాంగ్రెస్‌లోకి పంపించి పోటీ చేయిస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ(Telangana BJP) బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఎంఐఎం అభ్యర్థి కాంగ్రెస్ గుర్తు పైన పోటీ చేస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో హస్తంతోనే పతంగి ఎగిరేయాలని చూస్తున్నారు. ఇక్కడ ఎంఐఎం పార్టీ గెలవాలని.. వారి అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీలోకి పంపి పోటీ చేయిస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నిర్లక్ష్యం చేసింది. జూబ్లీహిల్స్‌లో ఒక్క ప్రభుత్వ కార్యాలయం కూడా లేదు. విశ్వ నగరం కాదు.. విషాద నగరంగా మార్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌కు ఓటు వేసినా ఫలితం లేదు. అక్కడ బీఆర్‌ఎస్ గెలిచినా.. మళ్లీ కాంగ్రెస్‌లోకే వెళ్తారు. తెలంగాణలో బీజేపీనే అసలైన ప్రతిపక్షం. ప్రజాసమస్యలపై బీజేపీ పోరాటం చేస్తుంది. ఉప ఎన్నికల్లో బీజేపీదే విజయం అని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి కన్నుమూత