
పాట్నా: వారం రోజుల క్రితం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. సాధారణంగా ఇటువంటి విషాద ఘటనల తర్వాత జిల్లా స్థాయి నేతలు, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చే ప్రయత్నం చేస్తారు. కానీ తాజాగా జరిగిన ఘటన అందుకు భిన్నంగా ఉంది. ప్రమాదం జరిగిన ఐదు రోజుల తర్వాత నిన్న వినాయక చవితి రోజు బాధితులను పరామర్శించేందుకు రాష్ట్ర మంత్రి వచ్చారు. ఈ ఆలస్యంపై గ్రామస్థుల ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి వచ్చిన కొన్ని నిమిషాల తర్వాత ఆయనను కిలోమీటర్ దూరానికి పైగా వెంబడించి దాడి చేశారు. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
గత శనివారం (ఆగస్టు 23న) బీహార్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఉదయం 6:45 గంటల సమయంలో షాజహాన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డానియావాన్ – హిల్సా రహదారిపై ఎదురెదురుగా లారీ- ఆటో ఢీకొన్నాయి. గంగానదిలో పుణ్యస్నానం కోసం ఫతుహాకు వెళుతున్న ఆటోని ప్రయాణికుల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. బాధితులు నలందా జిల్లా జోగిపూర్ మలవాన్ గ్రామస్థులని పోలీసులు నిర్ధారించారు.
అయితే,ఈ ప్రమాదంలో బాధిత కుటుంబాల్ని ఓదార్చేందుకు స్థానిక ఎమ్మెల్యేతో కలిసి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శ్రవణ్ కుమార్ బుధవారం గ్రామానికి వచ్చారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి వచ్చిన కొన్ని నిమిషాల తర్వాత గ్రామస్తులు వారి వాహనాన్ని చుట్టుముట్టారు. కిలోమీటర్ దూరం మంత్రి కాన్వాయ్‌ని వెంబడించారు. బాధితులు మరణించింది ఎప్పుడు? మంత్రి పరామర్శకు వచ్చేది ఎప్పుడు? ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంత్రిపై దాడికి తెగబడ్డారు.
పోలీసుల సహాయంతో గ్రామస్థుల నుంచి మంత్రి,ఎమ్మెల్యే తప్పించుకున్నారు. ఈ సంఘటనలో మంత్రి సహాయకుడు గాయపడ్డాడు. ఆయనను హిల్సా సబ్-డివిజనల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. రాజకీయ నాయకులు బాధితుల కుటుంబాల్ని ఓదార్చే ప్రయత్నం చేయలేదని, ఎలాంటి పరిహారం ఇవ్వలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
बिहार: नालंदा में मंत्री श्रवण कुमार पर ग्रामीणों ने हमला किया, सुरक्षाकर्मी घायल
◆ मंत्री जी को भीड़ ने दौड़ाया, धोती पकड़कर भागते दिखे श्रवण कुमार #Nalanda #NitishKumar #ShrawanKumar || Shrawan Kumar Bihar Minister pic.twitter.com/7fZgwpbbxe— बाबा टुल्लू जी (@abhaysingh147) August 27, 2025