పవన్‌తో పని చేసినందుకు అసహ్యం వేస్తోంది: పోతిన మహేష్‌ | Big Shock To Jana Sena Pawan Kalyan Pothina Mahesh Resigned, Details Inside - Sakshi
Sakshi News home page

Pothina Mahesh Resigns: జనసేనకు పోతిన మహేష్‌ రాజీనామా.. పవన్‌పై సంచలన వ్యాఖ్యలు

Published Mon, Apr 8 2024 11:52 AM

Big Shock To Jana sena Pawan Kalyan Pothina Mahesh Resigned - Sakshi

ఎన్టీఆర్‌, సాక్షి: విజయవాడలో కూటమికి భారీ షాక్‌ తగిలింది. జనసేనకు షాక్‌ ఇస్తూ పశ్చిమ నియోజకవర్గ జనసేన ఇంఛార్జి పదవికి పోతిన వెంకట మహేష్‌  ఆ పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పవన్‌ మీద సంచలన వ్యాఖ్యలు చేశారాయన. 

ఆవేశంలోనో.. సీటు రాలేదోనో తాను జనసేన పార్టీకి రాజీనామా చేయలేదన్న.. భవిష్యత్తు ఇచ్చేవాడు నాయకుడని, పవన్‌ను నమ్మి అడుగులేసి తామంతా మోసపోయామని పోతిన మహేష్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. 

 • పవన్ కళ్యాణ్ పై జనసేనలోని నా బాధ్యతలకు, క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేశాను
 • నేను అవేశంతోనో, సీటు రాలేదనే అసంతృప్తితోనో మాట్లాడట్లేదు
 • భవిష్యత్తుకు ఇచ్చేవాడే నాయకుడు.. నటించేవారు నాయకుడు కాలేదు
 • రాజకీయాల్లో నటించేవారు నాయకుడు కాలేదు
 • పవన్ కల్యాణ్‌ను నమ్మి అడుగులు వేశాను
 • కొత్తతరం నాయకత్వం కోసం గుడ్డిగా అడుగులు వేశాం
 • పవన్ కల్యాణ్‌ మార్పు తీసుకొస్తాడని నమ్మాం
 • 2014లో పోటీ చేయకపోయినా, 2019లో ఒక్క సీటు గెలిచిన 2024పై ఆశలు పెట్టుకున్నాం
 • జరుగుతున్నది, జరిగింది అర్థం కాక పిచ్చెక్కింది
 • అయినా పవన్ కల్యాణ్‌లో స్పందన లేదు
 • రాష్ట్ర ప్రజలకు, కాపు యువతకు , నాలాంటి కొత్తతరం నాయకులకు పవన్ సమాధానం చెప్పాలి
 • పవన్ కల్యాణ్ నిజ స్వరూపం అందరూ తెలుసుకోవాలి
 • మేడిపండు చూడ మేలిమి ఉండు.. పొట్ట విప్పి చూడు పురుగులుండు.. లాంటి వ్యక్తి పవన్ కల్యాణ్‌ 
 • స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తితో ఇన్నేళ్ళు ప్రయాణం చేసినందుకు మామీద మాకు అసహ్యం వేస్తుంది
 • పార్టీ నిర్మాణం, క్యాడర్ పై పవన్ దృష్టి సారించలేదు
 • అన్నీ తాత్కాలికం.. అంతా నటన.. నమ్మి నట్టేట మునిగిపోయాం
 • ప్రజలు జనసైనికులకంటే తెలివైనవారు
 • పవన్ కల్యాణ్ సిద్ధాంతాలు ప్రజలకు అర్థం కావట్లేదు అనుకున్నాం
 • ఎంత చెప్పినా ప్రజలకు జనసేన పట్ల నమ్మకం రాలేదు
 • 25 కేజీల బియ్యం కాదు.. 25 ఏళ్ల భవిష్యత్తు కావాలనే పవన్ కళ్యాణ్ కనీసం 25 సీట్లలో పోటీ చేయలేకపోయారు
 • 25రోజుల తర్వాత పార్టీ భవిషత్తు చెప్పగలరా?
 • 21 సీట్లతో రాష్ట్ర ప్రజలకు, జనసేనకి ఏం భవిషత్తు ఇవ్వగలరు
 • పవన్ స్వార్ధానికి మా కుటుంబాలు బలైపోతున్నాయి
 • పార్టీలో మీకు తెలియకుండా అన్నీ జరుగుతున్నాయని భ్రమ పడ్డాం 
 • కానీ అన్నీ మీకు తెలిసే అన్నీ జరుగుతున్నాయి
 • పవన్ కల్యాణ్ చూపులో ద్వంద అర్థాలు ఉన్నాయి
 • సీట్లన్నీ తెలుగుదేశం నాయకులకే కేటాయించారు
 • గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు మీకోసం నిలబడతారా?
 • జనసేన ఎందుకు పెట్టారు.. ఏం ఆశించి పెట్టారు.. అసలు జనసేన ఎవరికోసం పెట్టారు?
 • పార్టీ పెట్టింది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు.. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పెట్టారని తెలుస్తోంది
 • అన్నీ ఆధారాలను బయటపెడతాను 
 • కాపు యువతను బలి చేయొద్దని కన్నీటితో అభ్యర్ధిస్తున్నా
 • మీరు మా గొంతు కోస్తున్న నొప్పి తెలుస్తుంది
 • మేము రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు అమ్ముకుంటే, మీరు ఆస్తులు కొనుక్కున్నారు
 • మా రక్తమాంసాలపై మీరు భవంతులు కట్టుకున్నారు
 • కాకినాడ మేయర్ సరోజ, శేష కుమార్, విశాఖలో మహిళా నాయకురాలికి మాత్రమే పదవులు పొడిగించారు
 • మీ గురించి, పార్టీలో బ్రోకర్ పనులు బయట పెడుతున్నారనే భయంతోనే వాళ్ల పదవులు పొడిగించారు
 • సుజనా చౌదరి(విజయవాడ వెస్ట్‌ కూటమి అభ్యర్థి) గతంలో బినామీ ఛానల్ లో మీ తల్లిని దూషించారు
 •  అలాంటి సుజనాకు మీరు టికెట్ ఎలా ఇప్పిస్తారు?
 • సుజనా గెలుపులో మీరు ఎలా భాగస్వామ్యం అవ్వాలనుకుంటున్నారు
 • కన్నతల్లిని విమర్శించి, పచ్చనోట్లు పడేస్తే అన్నీ మర్చిపోయారా?
 • విజయవాడలో జనసేన జెండా లేదు.. గాజు గ్లాసు గుర్తు లేదు
 • మేము బతికించిన పార్టీని మీరు చంపేశారు
 • టీడీపీ వేసే కుక్క బిస్కెట్లు మనకి వద్దు అన్నారు.. ఇప్పుడు ఆ బిస్కెట్లు ఎందుకు తీసుకున్నారు
 • జనసేనను సీట్లు అడగకుండా బీజేపీ ఎందుకు త్యాగం చేశారో చెప్పాలి
 • బీజేపీ, టీడీపీని సీట్లు అడిగితే మీరు ఎందుకు ఇచ్చారు?
 • పొత్తు ధర్మం బిజెపి, టీడీపీలకు లేదా, కేవలం జనసేనకు మాత్రమే ఉందా
 • పొత్తు కుదిర్చితే ఎక్కువ స్థానాలు కోరుకోవాలి కదా.. ఎక్కువ సీట్లు సాధించాలి కదా!
 • మీరెందుకు ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించారు
 • కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జనసేన నుండి పోటీకి ఒక్క కాపు నాయకుడు దొరకలేదా..
 • అన్ని పార్టీలు విధేయతకు పట్టం కట్టాయి
 • కసాయివాడికి కనికరం ఉంటుంది.. మీపట్ల విధేయతతో ఉన్నందుకు కనీసం కనికరం లేదా?
 • మీమనసు ఇంత పాషాణ హృదయం అని ఊహించలేదు
 • 21 అసెంబ్లీ, 2ఎంపీల్లో ఏడు అసెంబ్లీ, ఒక  ఎంపీ మాత్రమే జనసేన కోసం పనిచేసినవాళ్లకు ఇచ్చారు
 • టీడీపీ నుండి వచ్చిన నేతలు జనసేనను టీడీపీలో విలీనం చేస్తే మీరు అడ్డుకోగలరా?
 • రాబోయే 12 నెలలో జనసేన అడ్రస్ గల్లంతు అవుతుంది
 • జనసేన పార్టీ ప్రజారాజ్యం-2 అయి తీరుతుంది
 • త్యాగాలకు బీసీలే కావాలా? కమ్మవారి త్యాగాలకు పనికి రారా?
 • మంగళగిరి, విజయవాడ పశ్చిమ బీసీల నుండి తీసుకుని కమ్మలకు ఇవ్వలేదా?
 • పశ్చిమ సీటు బలహీన వర్గాలలో ముస్లింలకో, సోము వీర్రాజు లాంటి వారికి ఇవ్వచ్చుగా?
 • పెట్టుబడిదారుడైన సుజనా చౌదరికి ఎందుకు ఇచ్చారు?
 • పద్మశాలిలకు ఒక్కసీటు ఎందుకు కేటాయించలేదు?
 • సుజనా స్థానంలో ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనార్టీ దొరకలేదా?
 • ఇదెక్కడి సామాజిక న్యాయం ?
 • పవన్ కల్యాణ్ కులాల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారు
 • రాజకీయ కుట్రలో భాగంగా కులాలకు కొమ్ము కాస్తున్నారు
 • 21 సీట్లలో ఒక్క చోట కూడా కాపులు హర్షించలేదు
 • పార్టీ భవిషత్తు ఇబ్బందుల్లోకి నెట్టివేయబడుతుంది 
 • కాపులు జనసెనకు దూరమయ్యారు.. పవన్ కి కాపులు మద్దతు ఇవ్వట్లేదు
 • కులాల మధ్య కుట్రలకు తెరలేపారు
 • గెలిచే భీమవరం స్థానాన్ని వదిలి పిఠాపురం ఎందుకు వెళ్ళారు
 • భీమవరంలో టీడీపీ నాయకుడిని ఎందుకు తీసుకొచ్చి టికెట్ ఇచ్చావు
 • సొంతఇల్లు కట్టుకోవడానికి భీమవరం ఎమ్మెల్యే ఇబ్బందులు పెడుతున్నారని చెప్పిన మాట అవాస్తవం
 • ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడివి అయ్యుండి వేరే పార్టీ నేత కాళ్లు ఎందుకు పట్టుకున్నావ్?
 • అనకాపల్లి సీటు ఎందుకు వదులుకున్నారు?
 • అనకాపల్లిలో నాగబాబు వచ్చాక పారిశ్రామికవేత్తల దగ్గర ఫండ్స్ వసూలు చేశారు
 • వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలనుకున్నారు.. అందుకే అక్కడినుండి వచ్చేశారు
 • నాదెండ్ల మనోహర్ కు జనసేన అనే బస్సు ఇస్తే ఆయన పెద్ద కొండకు గుద్ది ముక్కలుముక్కలు చేసారు
 • నష్టపోయింది మాత్రం మేము
 • మేము చెప్పేది వినే ఓపిక లేనపుడు పార్టీ ఎందుకు పెట్టారు
 • పొత్తు మరో పదేళ్లు కావాలా?
 • ఇప్పుడు చంద్రబాబు ఆ తర్వాత, ఆ తర్వాత కూడా ఎవరు ముఖ్యమంత్రిని చేయాలో చెప్తే బానిసల్లా జెండాలు మొస్తాం
 • నాదెండ్లా(నాదెండ్ల మనోహర్‌ను ఉద్దేశించి)... తెనాలి వస్తా, అక్కడే ప్రేస్మీట్ పెడతా
 • నేను చెప్పేవన్నీ నిజాలే.. నాకు దేనికీ భయం లేదు
 • చివరిగా నాకు ఓకే ఒక కోరిక.. పిఠాపురంలో మీ ఇల్లు గృహ ప్రవేశానికి అన్నా లేజినోవాతోనే రావాలి
 • మీ నెల రోజులు పర్యటన షెడ్యూల్ కి ఏర్పాట్లు చేయండి
 • జనసేన పార్టీ మొత్తం వాట్సాప్ లోనే నడుస్తుంది

‘‘కొత్తతరం నేతల్ని పవన్‌ తయారు చేస్తారని గుడ్డిగా అడుగులు వేశాం. 2019లో జనసేనకు ఒక్క సీటు వచ్చినా.. పవన్‌తో నడిచి భంగపడ్డాం. నటించేవాళ్లు ఎన్నటికీ నాయకులు కాలేరు. స్వార్థరాజకీయ ప్రయోజనాలు కలిగిన వ్యక్తి పవన్‌. అందుకే పార్టీ నిర్మాణంపైగానీ, కేడర్‌పైగానీ ఆయన ఏనాడూ దృష్టి పెట్టలేదు. ’’ అని పవన్‌కు పోతిన మహేష్‌ చురకలు అంటించారు. 

ఇదిలా ఉంటే.. జనసేనలో పోతిన తొలి నుంచి ఉన్నారు. పవన్‌ను నమ్ముకునే పార్టీలో కొనసాగుతున్నారు. గత ఐదేళ్లుగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో జనసేన బలోపేతం కోసం ఎంతో కృష్టి చేశారాయన. ఈ క్రమంలోనే  వెస్ట్‌ సీటుపై మహేష్‌ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. చివరకు టికెట్‌ కోసం పెత్తందారులతో పోరాడినా ప్రయోజనం లేకుండా పోయింది.

విజయవాడ వెస్ట్‌ సీటు కోసం మొదటి నుంచి ఆసక్తికర రాజకీయం నడిచింది. టీడీపీ నుంచి ఇద్దరు నేతలు సీటు కోసం యత్నించగా.. పొత్తులో భాగంగా జనసేనకు వెళ్లొచ్చనే ప్రచారం తొలి నుంచి నడిచింది. దీంతో మహేష్‌ పవన్‌ నుంచి ఆ సీటు తనకేనని మాట తీసుకున్నారు. ఈ లోపు సీన్‌లోకి అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చిన ఏపీ బీజేపీ.. పొత్తులో భాగంగా ఆ సీటును తన్నుకుపోయింది. పవన్‌ ద్వారా చంద్రబాబు తన అనుచరుడు సుజనా చౌదరి(బీజేపీ)కి ఇప్పించుకున్నారు.

అయినా కూడా మహేష్‌ సీటు కోసం ప్రయత్నించారు. పవన్‌పై చివరి నిమిషం వరకు నమ్మకం ప్రదర్శించారు. అయినప్పటికీ చివరకు.. వేల కోట్లున్న అగ్రవర్ణ నేత కోసం బీసీ నేత అయిన మహేష్‌ను పవన్‌ దగా చేశారు. పవన్‌ను నమ్మి తాను మోసపోయినట్లు మహేష్‌ ఇప్పుడు తన అనుచరుల వద్ద వాపోయారు. అధికారంలోకి వస్తే.. ఏదైనా పదవి ఇస్తామని పవన్‌ ఆఫర్‌ చేసినప్పటికీ మహేష్‌ అందుకు లొంగలేదని తెలుస్తోంది. పోతిన మహేష్‌ తదుపరి  రాజకీయ అడుగులు ఎటు అనేది తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement