శరద్‌ పవార్‌ కొత్త పార్టీ పేరు.. NCP శరద్‌చంద్ర పవార్

Back Back EC allots NCP Sharadchandra Pawar Name party led Sharad Pawar - Sakshi

ముంబై: శరద్‌ పవార్‌ కొత్త పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. కొత్త పార్టీ పేరును ఈసీ ఖరారు చేసింది. ఎన్‌సీపీ శరద్‌ చంద్రపవార్‌ పార్టీగా నామకరణం చేసింది. లోక్‌సభ ఎన్నికల వేళ.. రాజకీయ దిగ్గజం శరద్‌ పవార్‌కు కేంద్ర ఎన్నికల సంఘం  మంగళవారం బిగ్‌ షాక్‌ ఇచ్చింది. అజిత్‌ పవార్‌ వర్గాన్నే అసలైన ఎన్సీపీ(NCP)గా గుర్తిస్తూ.. గడియారం గుర్తును ఆ వర్గానికే కేటాయించింది.

ఎస్పీపీ ఎవరిదనే విషయంలో గత కొంతకాలంగా ఆ పార్టీ చీలిక వర్గాలు కుమ్ములాడుకుంటున్న విషయం తెలిసిందే. ఎన్సీపీకి మొత్తంగా 53మంది ఎమ్మెల్యేలు ఉండగా.. అజత్‌ వర్గం చీలిక తర్వాత శరద్‌ పవార్‌ ఆ పార్టీపై క్రమంగా నియంత్రణ కోల్పోతూ వచ్చారు. ప్రస్తుతం ఆయనకు 12మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉన్నట్లు సమాచారం.

ఇక.. గతేడాది ఎన్సీపీ నుంచి చీలిపోయి మెజార్టీ ఎమ్మెల్యేలతో కలిసి షిండే-బీజేపీ సర్కారుకు మద్దతు పలికిన అజిత్‌ పవార్‌ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన వర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలూ మంత్రులయ్యారు. దీంతో ఎన్సీపీలో చీలిక ఏర్పడింది.

whatsapp channel

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top