రాహుల్‌ గాంధీ ఎవరు? ఆయన నాకు తెలియదు: ఒవైసీ

Asaduddin Owaisi Says Who Is Rahul Gandhi I dont know him - Sakshi

న్యూఢిల్లీ:  ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కాంగ్రెస్‌ పార్టీ, ఆ పార్టీ నేత రాహుల్‌ గాంధీపై విమర్శలు గుప్పించారు. అజెండా ఆజ్‌తక్‌లో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో బీజేపీ నేత సుధాంశు త్రివేది పాటు పాల్గొన్నారు. వీరిద్దరూ ‘తమకు వ్యతిరేకంగా  పోరాటం’ పేరుతో  జరిగిన చర్చలో ఎవరు బీజేపీ లేదా కాంగ్రెస్‌తో సెకండ్‌ గేమ్‌ ఆడుతున్నారన్న అంశంపై మాట్లాడారు.

అయితే ఈ సందర్భంగా ఒవైసీ మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనరర్జీ తృణమూళ్‌ కాంగ్రెస్‌ పార్టీని ఇతర రాష్ట్రాల్లో విస్తరించాలని ఆమె చూస్తోందని తెలిపారు. దానివల్ల మరో రెండు మూడు ఏళ్లలో దేశంలో కాంగ్రెస్‌ పార్టీ పూ​ర్తిగా లేకుండా పోతుందని అన్నారు.

ఈ క్రమంలోనే రాహుల్‌ గాంధీ ఎవరు? ఆయన తనకు తెలియదని ఒవైసీ ఎద్దేవా చేశారు. మీకు తెలిస్తే తనకు తెలియజేయాలని వ్యాఖ్యాతను ఎదురు ప్రశ్నిస్తారు. తాము ప్రతీ పార్టీకి బీ-టీమ్‌ పార్టీని ఆరోపించబడ్డామని అన్నారు. అయితే రాహుల్‌ గాంధీని ఇక్కడికి పిలిచినా ఆయన కూడా బీజేపీ వాళ్ల మాటే మాట్లాడుతాడని అన్నారు. ప్రస్తుతం టీఎంసీ పార్టీ బీ-టీం పార్టీగా మారిందని అన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ తమను బీజేపీ బీ-టీం పార్టీ అంటుందని, గోవాలో కాంగ్రెస్‌ ఎలా గెలుస్తోందో చూడాలని ఆసక్తిగా ఉందని తెలిపారు. ఒవైసీ వ్యాఖ్యలపై బీజేపీ నేత సుధాంశు త్రివేది మాట్లాడుతూ.. కేరళ, పశ్చిమ బెంగాల్‌, అస్సాం రాష్ట్రాల్లో ఎంఐఎం వంటి పార్టీ, ఒవైసీ వంటి నేత ఎదగడానికి కాంగ్రెస్‌ సాయం చేసిందని కౌంటర్‌ ఇచ్చాడు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top