‘నన్ను ఎవరూ కిడ్నాప్‌ చేయలేదు.. బీఆర్‌ఎస్‌లోనే ఉన్నా’ | Aroori Ramesh Gives Clarity On Party Change | Sakshi
Sakshi News home page

‘నన్ను ఎవరూ కిడ్నాప్‌ చేయలేదు.. బీఆర్‌ఎస్‌లోనే ఉన్నా’

Mar 13 2024 3:51 PM | Updated on Mar 13 2024 4:28 PM

Aroori Ramesh Gives Clarity On Party Change - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గత రెండు రోజులుగా బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ పార్టీ మారబోతున్నారని వార్తలు వైరల్‌ అయ్యాయి. ఆయన బీఆర్‌ఎస్‌ పార్టీ మారి బీజేపీలో చేరుతున్నారని చర్చ జరిగింది. ఆయన పార్టీ మార్పుపై వరంగల్‌లో ఈరోజు హైడ్రామా కొనసాగింది. ఏకంగా ఆయన్ను బీజేపీలో చేరకుండా బీఆర్‌ఎస్‌ నాయకులే కిడ్నాప్‌ చేశారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఆరూరి.. బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌నేత ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి హైదరాబాద్‌ వచ్చి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆరూరి రమేష్‌ మీడయాతో మాట్లాడారు. ‘బీఆర్‌ఎస్‌లోనే కోనసాగుతున్నా. అమిత్‌ షాను కలవలేదు.. కానీ, బీజేపీ నాయకులను మాత్రమే కలిశాను. మా పార్టీ నేతలే నన్ను తీసుకుని వచ్చారు. నన్ను బీఆర్ఎస్ నేతలు కిడ్నాప్ చేయలేదు. మా పార్టీ నేతలు నన్ను కిడ్నాప్ ఎందుకు చేస్తారు?’ అని ఆరూరి స్పష్టత ఇచ్చారు.
 

Advertisement
 
Advertisement
Advertisement