
జాతీయ మీడియాలు నిర్వహించిన సర్వేలో ఏపీలో సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ మరోసారి భారీ విజయం సాధించడమనే విషయం స్పష్టమవుతూ ఉంది. అదే సమయంలో టీడీపీకి మరోమారు ఘోర పరాభవం తప్పదనే విషయం కూడా అవగతమవుతూ ఉంది.
అయితే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం దీన్ని ఖండిస్తూ వస్తున్నాడు. ఈ సర్వేలను బాబుగారు నమ్మరట. ఆయన తమ చిలక జ్యోతిష్యుడు లగడపాటి(చౌదరి) సర్వే తప్ప ఏది నమ్మం అనే ధోరణి కనబరుస్తున్నారు చంద్రబాబు.
దీనికి చంద్రబాబు అనుకూల మీడియాలు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5 బాగా డబ్బా కొడుతున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వేను నమ్మం అంటూ గారాలు పోతున్నాయి.
టైమ్స్ ఆఫ్ ఇండియా సంస్థ 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీకి 20-22 సీట్లు వస్తాయి అని చెప్పింది. ఆ సర్వే చెప్పినట్లు వైఎస్సార్‌సీపీ 22 సీట్లు గెలిచింది.
ఎల్లో మీడియా ఈనాడు. ఆంధ్రజ్యోతి, టీవీ 5 ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇటీవల వచ్చిన ఏ జాతీయ మీడియా సర్వే అయినా టీడీపీ గెలుస్తుంది అని చెప్పాయా ? పలు జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేలు ఏం చెబుతున్నాయో ఒక్కసారి చూడండి.
1)లోక్ పోల్ సర్వే ,ఫిబ్రవరి 12 2023
వైఎస్సార్‌సీపీకి 18 ఎంపీ సీట్లు , టీడీపీకి 7 ఎంపీ సీట్లు
2)ఇండియా టీవీ సర్వే (జులై 31 2023) ప్రకారం
వైఎస్సార్‌సీపీకి 18 ఎంపీ సీట్లు , టీడీపీ 7 ఎంపీ సీట్లు
3)టైమ్స్ నౌ సర్వే ఆగష్టు 17 2023
వైఎస్సార్‌సీపీకి 24-25 ఎంపీ సీట్లు ( ఓట్లు 51 శాతం )
టీడీపీకి -0-1 ఎంపీ సీటు (ఓట్లు 36 శాతం )
జెఎస్పీ(జనసేన పార్టీ) - 0 ఎంపీ సీట్లు (ఓట్లు 10 శాతం )
గమనిక: బాబు కూడా సర్వేలు చేయించుకుంటాడు.ఆ సర్వే లలో టీడీపీ కి 34 శాతం మించి ఓట్లు రావడం లేదు వైఎస్సార్‌సీపీ 52 శాతం ఓట్లు వస్తున్నాయి.అందుకే జనసేన బీజేపీ తో పొత్తు కావాలి అని అడుక్కొంటున్నాడు