ఈటీజీ టైమ్స్‌ నౌ సర్వేలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం | ETG Times Now Survey 2023 YSRCP May Chances Clean Sweep 25 Seats | Sakshi
Sakshi News home page

ఈటీజీ టైమ్స్‌ నౌ సర్వేలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం

Aug 16 2023 9:27 PM | Updated on Aug 31 2023 3:00 PM

ETG Times Now Survey 2023 YSRCP May Chances Clean Sweep 25 Seats - Sakshi

2024 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఓట్ల శాతం మరింత పెరుగుతుందని.. 

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ సంక్షేమ ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించనుందని ఈటీజీ టైమ్స్‌ నౌ సర్వే వెల్లడించింది.  లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మొత్తం 25 సీట్లు  కైవసం చేసుకుని క్లీన్‌ స్వీప్‌ చేసే అవకాశాలున్నాయని పేర్కొంది. 

2024 సార్వత్రిక ఎన్నికల్లో.. ఏపీలో వైఎస్సార్‌సీపీకి ఓట్ల శాతం మరింత పెరుగుతుందని,  51.3 శాతం ఓట్ల శాతంతో మొత్తం 25  ఎంపీ సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉందని ఈటీజీ టైమ్స్‌ నౌ సర్వే తెలిపింది.

టీడీపీ ఒక్క ఎంపీ సీటు దక్కితే దక్కొచ్చని, వైఎస్సార్‌సీపీ క్లీన్‌ స్వీప్‌ చేస్తే మాత్రం టీడీపీ ఖాతా నిల్‌ అని విషయాన్ని చెప్పేసింది ఈటీజీ టైమ్స్‌ నౌ సర్వే.  ఇక ఈ సర్వేలో జనసేన ఖాతాకు ఒక్క సీటు కూడా దక్కదని ప్రస్తావించింది.

ఇక 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలో ప్రభంజనం సృష్టించిన వైఎస్ఆర్సీపీ..  లోక్ సభ ఎన్నికల్లోనూ సత్తా చాటింది. 25 లోక్ సభ స్థానాలకు గానూ..  వైఎస్సార్‌సీపీ 22 స్థానాలను కైవసం చేసుకుని జయకేతనం ఎగరేసింది. టీడీపీ 3 స్థానాలకే పరిమితమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement