అమిత్‌ షా-తమిళిసై మధ్య అసలేం జరిగింది! | Amit Shah Serious On Tamilisai In Chandrababu Naidu Oath Ceremony At Vijayawada, Video Goes Viral | Sakshi
Sakshi News home page

తమిళిసైపై అమిత్‌ షా సీరియస్‌ దేనికి?.. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జరిగింది ఇదే..

Published Wed, Jun 12 2024 12:22 PM | Last Updated on Wed, Jun 12 2024 1:04 PM

amit shah serious on tamilisai chandrababu oath ceremony at vijayawada

సాక్షి, విజయవాడ: చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమ వేదికపై  ఆసక్తికర ఘటన ఒకటి చోటు చేసుకుంది. బీజేపీ అగ్రనేత అమిత్‌ షా ఆ పార్టీ మహిళా నేత తమిళిసై సౌందరరాజన్‌ మధ్య జరిగిన సన్నివేశమది. ఈ కార్యక్రమానికి తెలంగాణ మాజీ గవర్నర్‌, తమిళనాడు బీజేపీ నేత  తమిళిసై సౌందరరాజన్‌ కూడా హాజరయ్యారు. అక్కడే వేదిక మీద ఉన్న బీజేపీ పెద్దలకు నమస్కారం చేసి ముందుకు వెళ్లబోయారు. అయితే.. 

కేంద్ర మంత్రి అమిత్‌ షా ఆమెను వెనక్కి పిలిచారు. ఒక్కసారిగా ఆమెపై సీరియస్‌ అయ్యారు. తమిళిసై ఏదో చెప్పబోతుండగా.. అడ్డుకుని మరీ అమిత్‌ షా ఆమెను ఏదో వారించినట్లు ఉంది.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  

తమిళిసైకి, కేంద్ర మంత్రి అమిత్‌ షాకి మధ్య అసలు ఏం జరిగింది?. ఆమెపై కేంద్రమంత్రి అమిత్‌ షా ఎందుకు అంత సీరియస్‌ అయ్యారని షోషల్‌మీడియాలో చర్చ జరుగుతోంది.

ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ పేలవమైన ప్రదర్శన ఇచ్చింది. బీజేపీ రాష్ట్ర చీఫ్‌ అన్నామలైతో పాటు తమిళిసై కూడా ఓటమి పాలయ్యారు. ఆ వెంటనే ఆమె అన్నామలైకి వ్యతిరేకంగా స్టేట్‌మెంట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అమిత్‌ షా పంచాయితీలు పెట్టొద్దంటూ ఆమెను వారించి ఉంటారని పలువురు కామెంట్లు చేస్తున్నారు. దీనిపై బీజేపీ స్పందిస్తేనే అసలేం జరిగిందనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement