పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధి శాంతినగర్ రెండో వార్డు, రాఘవ్రోడ్డులోని సర్వే నంబర్లు 518/4, 519లో డీటీసీపీ అనుమతులు లేకుండానే ప్లాట్ల విక్రయాలకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ భూములను వెంచర్లో కలిపి చూపుతున్నారు. సర్వే నిర్వహించి ప్రభుత్వ భూముల హద్దులను గుర్తించాలి. నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు విక్రయిస్తే కొనుగోలుదారులు నష్టపోయే ప్రమాదం ఉంది. అనుమతులు లేని ప్లాట్ల విక్రయాలను అడ్డుకోవాలి. వెంచర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి.
– బండారి సునీల్, పెద్దపల్లి


