పనికి తగిన వేతనం చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

పనికి తగిన వేతనం చెల్లించాలి

Nov 10 2026 1:19 AM | Updated on Nov 10 2026 1:19 AM

పెద్దపల్లి: ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ ప్రజాపంథా ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌ ఎదుట సమ్మె చేస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల శిబిరాన్ని సోమవారం సందర్శించి సంఘీభావం ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 17 వేల మందికి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్నారు. సమ్మెకు ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) జిల్లా అధ్యక్షురాలు, నాయకులు మద్దతు తెలిపారు. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు మహేందర్‌, మారుతి, మాణిక్యేశ్వర్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement