● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ | - | Sakshi
Sakshi News home page

● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

Nov 10 2026 1:19 AM | Updated on Nov 10 2026 1:19 AM

● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

ధర్మారం: ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. మండలకేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో ఆదివారం ఏర్పాటు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్‌కట్‌ చేశారు. నాయకులకు, కార్యకర్తలకు స్వీట్లు తినిపించారు. అనంతరం మండలకేంద్రంలోని బెడ్డల నాగమణి బానేశ్‌, తమ్మడవేని సరిత, రాజలింగు ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి అక్కడే దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.

రైతులను ఇబ్బందిపెడితే సస్పెండ్‌ చేస్తాం

వరిధాన్యం కొనుగోలు కేంద్రాలల్లో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సస్పెండ్‌ చేస్తామని మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. మండలంలోని మల్లాపూర్‌లో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. కేంద్రానికి వచ్చిన రైతులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలన్నారు. తేడాలు వస్తే సింగిల్‌విండో సిబ్బంది, జిల్లా స్థాయి అధికారులను క్షమించే ప్రసక్తి లేదన్నారు. మండలంలోని జక్కన్నపల్లి నుంచి ఎర్రగుంటపల్లి వరకు సెంట్రల్‌ లైటింగ్‌, డబుల్‌రోడ్డు పనులు త్వరలోనే ప్రారంభమవుతాయన్నారు. ఎర్రగుంటపల్లి శివారులో ఐటీఐ కళాశాల పనులు రెండునెలల్లో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో నియోజకవర్గ ప్రజలు, రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదన్నారు. మేడారం రిజర్వాయర్‌ సామర్థ్యం పెంచే యోచనలోనే రూ.350 కోట్లు వెచ్చించి చామనపల్లి మొత్తాన్ని ముంపు గ్రామంగా ప్రకటించినట్లు తెలిపారు. రెండేళ్లలో పత్తిపాకలో రిజర్వాయర్‌ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమాల్లో తహసీల్దార్‌ శ్రీనివాస్‌, పార్టీ మండల అధ్యక్షుడు లావుడ్య రూప్లానాయక్‌, నియోజకవర్గ యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు అసోద అజయ్‌, మండల యువజన అధ్యక్షుడు తిరుపతి, పట్టణ ప్రధాన కార్యదర్శి ఓరం చిరంజీవి, జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతిరెడ్డి, కొత్త నర్సింహం, పత్తిపాక విండో చైర్మన్‌ నోముల వెంకటరెడ్డి, సర్పంచు శ్రీనివాస్‌, నాయకులు చింతల ప్రదీప్‌రెడ్డి, దాగేటి ఉదయ్‌, జితేందర్‌నాయక్‌, మెడేవని తిరుపతి, బద్దం అజయ్‌పాల్‌రెడ్డి, జంగ మహేందర్‌, దేవి జనార్ధన్‌, కాడే సూర్యనారాయణ, పాలకుర్తి రాజేశంగౌడ్‌, అరిగే లింగయ్య, గందం మహిపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement