జ్యోతినగర్: ప్రజల మధ్య పండుగ జరుపుకోవడంలోనే నిజమైన ఆనందం ఉందని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ అన్నారు. ఆదివారం దీపావళి పర్వదినం సందర్భంగా 2వ డివిజన్ జంగాలపల్లె శివారులోని డబుల్బెడ్రూమ్ ఇళ్లలో నివాసముంటున్న కుటుంబాలతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. ప్రతి ఇంటా దీపావళి వెలుగులు నింపాలని, ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సతీమణి మనాలి రాజ్ఠాకూర్, మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్ వెంగల బాపు తదితరులు పాల్గొన్నారు.


