కేన్సర్‌ కలవరం | - | Sakshi
Sakshi News home page

కేన్సర్‌ కలవరం

Nov 10 2026 1:19 AM | Updated on Nov 10 2026 1:19 AM

● జిల్లాలో పెరుగుతున్న రోగులు ● బాధపడుతున్న వారిలో మహిళలే అధికం

● జిల్లాలో పెరుగుతున్న రోగులు ● బాధపడుతున్న వారిలో మహిళలే అధికం

పెద్దపల్లి: జిల్లాలో కేన్సర్‌ వ్యాధి ఆందోళనకరంగా విస్తరిస్తోంది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, వాయుకాలుష్యం, అవగాహన లోపం తదితర కారణాలు వ్యాధి పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు గర్భాశయ, రొమ్ము కేన్సర్ల బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కేన్సర్‌పై అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నోటి, గొంతు, మూత్రాశయ కేన్సర్‌ కేసులు కూడా నమోదవుతున్నాయి. పారిశ్రామిక ప్రాంతమైన రామగుండంలో కేన్సర్‌ కేసుల నమోదు ఎక్కువగా ఉండడం ఆందోళనకర పరిణామం.

లక్షల్లో స్క్రీనింగ్‌.. వందల మందికి గుర్తింపు

జిల్లాలో 18ప్రాథమిక, 8 అర్బన్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కేన్సర్‌ ముందస్తు గుర్తింపు కోసం వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక స్క్రీనింగ్‌ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. జిల్లాలో 3,67,693 మందిని లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇప్పటివరకు 3,25,381 మందికి పరీక్షలు పూర్తయ్యాయి. వీరిలో నోటి, గొంతు కేన్సర్‌ కేసులు 62, రొమ్ము కేన్సర్‌ 99, గర్భాశయ కేన్సర్‌ 46, ఇతర కేన్సర్లు 64 గుర్తించారు. పరీక్షల ద్వారా వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స అందించేందుకు వైద్యశాఖ చర్యలు చేపడుతోంది.

పరీక్షలకు వెనకడుగు.. ప్రాణాల మీదకు..

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా కేన్సర్‌ నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉన్నప్పటికీ చాలామంది పరీక్షలు చేయించుకోవడానికి ముందుకు రావడం లేదు. పరీక్షల్లో వ్యాధి బయటపడుతుందనే భయంతో నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో వ్యాధి ముదిరిన తర్వాత ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది.

ముందస్తుగా గుర్తిస్తే మెరుగైన చికిత్స

ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. పొగాకు, గుట్కా వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి. కేన్సర్‌ను ముందస్తుగా గుర్తిస్తే మెరుగైన చికిత్సతో వ్యాధిని నియంత్రించే అవకాశం ఉంటుంది. ఏమాత్రం అనుమానం ఉన్నా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. – డాక్టర్‌ సంజనేశ్‌, ఎన్‌సీడీ

జిల్లా ప్రోగ్రాం అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement