ఇండోనేషియా ఆర్ట్‌ ప్రదర్శనకు ఎస్‌ఎస్‌ఆర్‌ కృష్ణ | - | Sakshi
Sakshi News home page

ఇండోనేషియా ఆర్ట్‌ ప్రదర్శనకు ఎస్‌ఎస్‌ఆర్‌ కృష్ణ

Oct 24 2026 12:16 AM | Updated on Oct 24 2026 12:16 AM

26న సంచాలన్‌ భవన్‌లో నిరాహార దీక్ష

రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ సికింద్రాబాద్‌ డివిజన్‌ ప్రధాన కార్యదర్శి రవీందర్‌

రామగిరి: జేఎన్‌టీయూ కాంట్రాక్ట్‌ అధ్యాపకుడు, ప్రముఖ త్రీడీ ఆర్టిస్ట్‌ సింగారపు శివరామకృష్ణ (ఎస్‌ఎస్‌ఆర్‌ కృష్ణ)కు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన అవకాశం లభించింది. ఇండోనేషియాలోని యోగ్యకార్త నగరంలో అక్టోబర్‌ 28 నుంచి నవంబర్‌ 10 వరకు నిర్వహించనున్న ‘అక్షర – నుసంతరా అండ్‌ దునియా’ అంతర్జాతీయ ఆర్ట్‌ ప్రదర్శనకు ఆయన ముఖ్య అతిథిగా, క్యూరేటర్‌గా వ్యవహరించనున్నారు. ఇండోనేషియా ప్రభుత్వ మంత్రిత్వ శాఖ సహకారంతో నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో 20 దేశాలకు చెందిన 175 మంది కళాకారులు రూపొందించిన 272 చిత్రాలను ప్రదర్శించనున్నారు. ‘ప్రపంచ లిపుల చారిత్రక వారసత్వం’ ఇతివృత్తంగా ఈ ప్రదర్శన జరగనుంది. ఎస్‌ఎస్‌ఆర్‌ కే అకాడమీకి చెందిన కృష్ణ శిష్యులు 17 మంది రూపొందించిన చిత్రాలు కూడా ఎంపికయ్యాయి. కృష్ణ ప్రత్యేకంగా రూపొందించిన త్రీడీ ఆర్ట్‌ను రెండు వారాలపాటు ప్రదర్శించనున్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన నిర్వాహకులకు, మిత్రుడు మియోస సెప్టకు కృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ప్రదర్శనకు ఎంపికై న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

గోదావరిలో మునిగి మృతి

గోదావరిఖని: గోదావరి నది స మ్మక్క– సారలమ్మ గద్దెల వద్ద శుక్రవారం స్నేహితులతో సరదాగా ఈతకని వెళ్లి మేదరిబస్తీ కి చెందిన గోపి పవన్‌ (34) మృతి చెందాడు. తిలక్‌నగర్‌కు చెందిన(ప్రస్తుతం మేదరిబస్తీలో నివాసం) గోపిపవన్‌ ప్రైవేట్‌ డ్రైవర్‌. తన స్నేహితులైన కుంభాల సందీప్‌, బోరం రంజిత్‌, తుంగపల్లి సాయికుమార్‌తో కలిసి శుక్రవారం గోదావరినదికి వెళ్లి మద్యం తాగారు. అనంతరం సాయికుమార్‌, సందీప్‌ కలిసి గోపిపవన్‌ ఈత కొట్టేందుకు గోదావరినదిలోకి దిగారు. ఈతరాకపోవటంతో గోపిపవన్‌ నదిలో మునగగా సాయికుమార్‌, రంజిత్‌ నీటినుంచి పైకి తీశారు. అనంతరం రంజిత్‌ సీపీఆర్‌ చేయగా అప్పటికే గోపిపవన్‌ మృతి చెందాడు. మృతుడికి ఆరె నెలల క్రితమే భార్యతో విడాకులయ్యాయి. మృతుడి తల్లి గోపి రాజేశ్వరి ఫిర్యాదు మేరకు వన్‌ టౌన్‌ సీఐ ఇంద్రసేనారెడ్డి కేసు నమోదు చేసుకొన్నారు.

తొలితరం క్రికెటర్‌ ప్రతాప్‌ ఇకలేరు

గోదావరిఖని: పెద్దపల్లి జి ల్లా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో తొలితరం క్రికెటర్‌, సింగరేణి రిటైర్డ్‌ ఉద్యోగి జాలి ప్రతాప్‌(67) అనారోగ్యంతో హైదరాబాదులోని ఆస్పత్రిలో చికి త్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని స్థానిక సీహెచ్‌పీకాలనీలో సింగరేణి క్వార్టర్‌లో వద్ద భద్రపరిచారు. ఆయన కుమారుడు అమెరికా నుంచి శనివారం చేరుకోగానే అదేరోజు అంత్యక్రియలు నిర్వహిస్తారు. క్రికెటర్‌గా, డాన్సర్‌గా గోదావరిఖని ప్రజలకు ప్రతాప్‌ సుపరిచితుడు. ఆయన మృతిపై ఏఐటీయూసీ రాష్ట్ర డిప్యూటీ జనరల్‌ సెక్రెటరీ కె.స్వామి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు గుమ్మడి కుమారస్వామి, టీబీజీకేఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాదాసి రామమూర్తి, సింగరేణి ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ గౌరవ సలహాదారు పులిమోహన్‌, గోదావరి బ్లుస్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, కోచ్‌ డి.కిరణ్‌కుమార్‌, నాయకుడు ముక్క సుదర్శన్‌, ప్రజానాట్యమండలి జాతీయ ఉపాధ్యక్షుడు కన్నం లక్ష్మీనారాయణ తదితరులు సంతాపం తెలిపారు.

రన్నింగ్‌ స్టాఫ్‌ సమస్యలు పరిష్కరించాలి

రామగుండం: లోకో పైలట్లు, అసిస్టెంట్‌ లోకోపైలట్లు, ట్రైన్‌ మేనేజర్లు తదితర రన్నింగ్‌ సిబ్బంది రైలు భద్ర త, నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తున్నారని, వారి సమస్యలను పరిష్కరించడంలో రైల్వేశాఖ విఫలమవుతోందని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్‌ యూనియ న్‌ సికింద్రాబాద్‌ డివిజనల్‌ ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి రవీందర్‌ శుక్రవా రం విమర్శించారు. హ్యాండీ క్యాప్డ్‌, పైలట్‌ సెక్షన్లకు ఆమోదం కల్పించాలనే డిమాండ్‌తో ఈనెల 26న సికింద్రాబాద్‌లోని సంచాలన్‌ భవన్‌ ఎదుట నిరాహా ర దీక్ష చేపడుతున్నామన్నారు. అన్ని అర్హత కలిగిన సెక్షన్లకు సమన్యాయం జరగాలని, రన్నింగ్‌ సిబ్బంది విపత్కర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నా పెండింగ్‌ ప్రతిపాదనలపై తక్షణ నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రతీ సైన్‌–ఆన్‌ నుంచి సైన్‌–ఆఫ్‌ వరకు కనీసం 120 కి.మీ. అలవెన్స్‌ వర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నిరాహార దీక్షలో లోకో, ట్రాఫిక్‌ శాఖలకు చెందిన రన్నింగ్‌ సిబ్బంది, మజ్దూర్‌ యూనియన్‌ డివిజనల్‌ కార్యవర్గాల సభ్యులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

ఆర్థిక ఇబ్బందులతో ఒకరి ఆత్మహత్య

తిమ్మాపూర్‌: కరీంనగర్‌ కార్పొరేషన్‌ 8వ డివిజన్‌ పరిధిలోని సదాశివపల్లికి చెందిన బండారి శ్రీని వాస్‌(39) అల్గునూరు శివారులో చెట్టుకు ఉరేసుకు ని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై అరుణ్‌ కథనం ప్రకారం.. శ్రీనివాస్‌ లారీలు కొనుగోలు చేసి నడిపిస్తున్నాడు. ఇటీవల గిరాకీ రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. కిస్తీలు కట్టేందుకు అప్పు చేశాడు. అప్పులు తీర్చేందుకు గన్నేరువరంలోని ఐదు ఎకరాలు విక్రయించాడు. అయినా అప్పులు తీరలేదు. మనస్తాపం చెంది గురువారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు గాలించినా ఆచూకీ దొరకలేదు. శుక్రవారం ఉదయం అల్గునూరు శివారులో ఓ మామిడి చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్‌కు తరలించారు. శ్రీనివాస్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్‌ఎండీ పోలీసులు తెలిపారు.

ఏఎన్‌ఎం కుటుంబంలో విషాదం

చొప్పదండి: మండలంలోని గుమ్లాపూర్‌ ఏఎన్‌ఎంగా విధులు నిర్వహిస్తున్న ఎరవేని లలిత కుటుంబంలో విషాదం నెలకొంది. గత ఆగస్టులో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ దంపతుల్లో చికిత్స పొందుతూ లలిత భర్త ధర్మేందర్‌ మృతి చెందాడు. సుమారు రెండు నెలల పాటు వైద్యం పొందినా కుటుంబ పెద్దను కోల్పోవాల్సి వచ్చింది. అగస్టు 21న చొప్పదండి శివారులోని గుమ్లాపూర్‌ ఎక్స్‌రోడ్డు వద్ద లలిత దంపతులు వెళ్తున్న స్కూటీని కరీంనగర్‌ నుంచి ఆదిలాబాద్‌ జిల్లా వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. లలిత ఆమె భర్త ధర్మేందర్‌ తీవ్రంగా గాయపడ్డారు. నెలరోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన ధర్మేందర్‌ను ఇంటికి తీసుకొచ్చారు. బ్రీతింగ్‌ సమస్యతో కరీంనగర్‌లోని వారి ఇంట్లో మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement