పెరిగిన హాల్టింగ్‌లు.. తగ్గిన బోగీలు | - | Sakshi
Sakshi News home page

పెరిగిన హాల్టింగ్‌లు.. తగ్గిన బోగీలు

Oct 24 2026 12:16 AM | Updated on Oct 24 2026 12:16 AM

● ఫుల్‌ ఆక్యుపెన్సీ రేషియోతో వెయిటింగ్‌ లిస్ట్‌ ● వందేభారత్‌ రైళ్లు ప్రారంభించి రెండేళ్లు

● ఫుల్‌ ఆక్యుపెన్సీ రేషియోతో వెయిటింగ్‌ లిస్ట్‌ ● వందేభారత్‌ రైళ్లు ప్రారంభించి రెండేళ్లు

రామగుండం: నాగ్‌పూర్‌–సికింద్రాబాద్‌ వందేభారత్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు(20101/02) సెంట్రల్‌ రైల్వే జోన్‌లో నాగపూర్‌ డివిజన్‌ ఆధ్వర్యంలో రాకపోకలు సాగిస్తోంది. 2024 సెప్టెంబర్‌ 19న ప్రధాని మోదీ రైలును ప్రారంభించారు. తొలుత కాజీపేట, రామగుండం, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, బల్హర్షా, చంద్రాపూర్‌, సేవగ్రామ్‌లో హాల్టింగ్‌ సౌకర్యం కల్పించారు. తొలుత 20 బోగీలు (1,440 సీట్లు) సామర్ధ్యం ఉండేది. 30శాతమే ఆక్యుపెన్సీ నమోదయ్యేది. ఫిబ్రవరి 2025లో 8 బోగీలకు తగ్గించారు. ఆ తర్వాత మంచిర్యాలలో హాల్టింగ్‌ సౌకర్యం కల్పించడంతో ప్రయాణికుల రద్దీ పెరిగి ఒక్కసారిగా 200శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ప్రతీరోజు కనీసం 30పైగా వెయిటింగ్‌ జాబితాలోకి చేరింది. ఆదిలో ప్రయాణికులు అంతగా ఆసక్తి చూపకపోయినా, తర్వాత రైలు ప్రయాణంలో లగ్జరీ, వేగం, కచ్చితమైన సమయానికి బయలుదేరడం, గమ్యం చేరడం, బస్సు చార్జీతో పోల్చితే తక్కువ చార్జీ ఉండడం మంచిర్యాల, రామగుండం స్టేషన్ల నుంచి 3.30 గంటల వ్యవధిలోనే సికింద్రాబాద్‌ చేరుకోవడంతో ప్రయాణికులు దీనిపైనే మొగ్గుచూపుతున్నారు.

బోగీలు తగ్గించడం సరికాదు

తొలుత మంచిర్యాల హాల్టింగ్‌ ఇవ్వకముందు వందేభారత్‌కు ఆక్యుపెన్సీ రేషియా లేకపోవడంతో 20 బోగీల నుంచి ఏకంగా 8 బోగీలకు కుదించడంతో సీట్ల సామర్థ్యం సగానికి తగ్గిపోయింది. అంతగా ప్రాచుర్యం లేకపోవడం కూడా ఆక్యుపెన్సీ లేకపోవడానికి ఒక కారణమంటున్నారు.

వందేభారత్‌.. గంటన్నర ఆలస్యం

నాగ్‌పూర్‌–సికింద్రాబాద్‌(20101) వందేభారత్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు శుక్రవారం గంటన్నర ఆలస్యంగా రామగుండం చేరుకుంది. రామగుండం నుంచి సికింద్రాబాద్‌ వైపు వెళ్లే రైలు.. ఉదయం 9.09గంటలకు రామగుండం చేరాల్సి ఉండగా.. ఉదయం 10.42గంటలకు చేరుకుంది. ప్రతీరోజు నిర్దేశిత సమయానికే రాకపోకలు సాగిస్తుండగా శుక్రవారం గంటన్నర ఆలస్యంగా నడవడంతె ప్రయాణికులు అయోమయానికి లోనయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement