గుండెపోటుతో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి

Oct 24 2026 12:16 AM | Updated on Oct 24 2026 12:16 AM

గుండెపోటుతో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి యైటింక్లయిన్‌కాలనీ: పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్‌ ఆర్జీ–2 ఏరియాకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దుంపేటి ఉదయ్‌(34) శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఉదయ్‌కు భార్య, కుమార్తె(1) ఉన్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా గుండెపోటుకు గురయ్యాడు. ఆయన తల్లిదండ్రులు దుంపేటికమల మనోహర్‌ –మంజుల యైటింక్లయిన్‌కాలనీలో నివా సం ఉంటున్నారు. కాగా, సదాశయ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆయన నేత్రాలు సేకరించారు. ● ఘటనపై విచారణ

లైంగికదాడి యత్నం.. యువకుడి అరెస్ట్‌

కథలాపూర్‌(వేములవాడ): మండలంలోని గంభీర్‌పూర్‌ గ్రామానికి చెందిన ఏనుగుల మధును లైంగికదాడి యత్నం, హత్యాయత్నం కేసులో శుక్రవారం అరెస్టు చేసినట్లు ఎస్సై రవికిరణ్‌ తెలిపారు. మధు గొర్రెల కాపరిగా పనిచేస్తున్నారు. ఓ వివాహితపై ఈ నెల 21న లైంగికదాడికి యత్నించగా.. మహిళ ప్రతిఘటించి కేకలు వేసింది. అంతలోనే మధు మహిళ మెడలోని బంగారు ఆభరణాలు లాగి హత్యాయత్నానికి యత్నించాడు. సమీపంలో ఉన్నవారు గమనించి అక్కడకు చేరుకోగా మధు పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కోరుట్ల సీఐ తిరుపతి ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేసి మధును శుక్రవారం చేసినట్లు ఎస్సై వివరించారు.

అర్ధరాత్రి యువకుల

మధ్య ఘర్షణ

జరుపుతున్న పోలీసులు

మెట్‌పల్లిరూరల్‌ (కోరుట్ల) : బండలింగాపూర్‌లో గు రువారం అర్ధరాత్రి యువకుల మధ్య ఘర్షణ నెలకొంది. బండలింగాపూర్‌–వెల్లుల గ్రామానికి చెందిన రెండు వర్గాల మ ధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దాదాపు గంటకు పైగా జరిగిన ఘర్షణలో పలువురికి గాయాలు కాగా.. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. బండలింగాపూర్‌కు చెందిన పలువురు యువకులు వెల్లులకు వెళ్లిన సమయంలో యువకుల మధ్య వివాదం జరిగింది. ఈ క్రమంలో అక్కడ ఘర్షణ జర గ్గా.. వెల్లులకు చెందిన యువకులు పెద్ద సంఖ్యలో బండలింగాపూర్‌ వెళ్లినట్లు తెలిసింది. బండలింగాపూర్‌లో చావిడి వద్ద హనుమాన్‌ ఆలయం సమీపంలో బతుకమ్మ వేడుకల వద్ద ఉన్న యువకులతో వాగ్వాదానికి దిగగా.. వి వాదం ముదిరి ఘర్షణకు దారితీసింది. ఈ ఘ ర్షణలో కొందరికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న మెట్‌పల్లి సీఐ సురేశ్‌బాబు, ఎస్సైలు నవీన్‌కుమార్‌, కిరణ్‌కుమార్‌, సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement