జనగామలో కుంగిన చేతిపంపు | - | Sakshi
Sakshi News home page

జనగామలో కుంగిన చేతిపంపు

Oct 24 2026 12:16 AM | Updated on Oct 24 2026 12:16 AM

గోదావరిఖని: రామగుండం కార్పొరేషన్‌లోని జనగామలో చేతిపంపు కుంగింది. యాదవనగర్‌లో మంచినీటి కోసం ఓ మహిళ బోరు వద్దకు వెళ్లిబో రు కొడుతుండగా అకస్మాత్తుగా కుంగింది. దీంతో ఆ ప్రాంత వాసులు ఆందోళనకు గురయ్యారు. సింగరేణి భూగర్భ గని ఉండటంతో బోరువెల్‌ ఉన్న ప్రాంతంలో భూమి కుంగిందని, తమ ఇళ్ల పరిస్థితి ఏమిటని ఆందోళన చెందారు. దీనిపై విచారణ జరిపి వాస్తవాలు తెలపాల్సిన బాధ్యత సింగరేణిపై ఉందని గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయంపై ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్‌ మాట్లాడుతూ, సింగరేణి సర్వే, జియాలజీ బృందంతో శనివారం సర్వే చేయిస్తామన్నారు.

గనులపై ఏఐటీయూసీ సభ్యత్వ సేకరణ

గోదావరిఖని: ఏఐటీయూసీ నాయకులు శుక్రవారం గనులపై సభ్వత్య సేకరణ ప్రారంభించారు. కార్యక్రమాన్ని యూనియన్‌ డిప్యూటీ జనరల్‌సెక్రటరీ మ డ్డి ఎల్లాగౌడ్‌ ప్రారంభించారు. నాయకులు రంగు శ్రీను, సంకె అశోక్‌, బోగ సతీశ్‌ బాబు, మాదన మహేశ్‌, ఎస్‌.వెంకట్‌రెడ్డి, సిద్దమల్ల రాజు, దొంత సాయన్న, ఎం.చక్రపాణి, చెప్యాల భాస్కర్‌, సిర్ర మల్లికార్జున్‌, బిట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement