● త్వరలో పీఆర్‌పీ కూడా చెల్లింపు ● అధికారుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీపతిగౌడ్ వెల్లడి
గోదావరిఖని: ప్రభుత్వం, సీఎండీ, డైరెక్టర్ల సహకారంతో సింగరేణి అధికారుల పే అప్‌గ్రేడేషన్ సాధించామని అధికారుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీపతిగౌడ్, ప్రధాన కార్యదర్శి పెద్ది నర్సింహులు, ఉపాధ్యక్షుడు పొనుగోటి శ్రీనివాస్, ఆర్జీ–2 అధ్యక్షుడు రాముడు తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఆర్జీ–2 ఎన్‌సీవోఏ క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు, కోల్‌బెల్ట్ ఏరియాలోని ఎమ్మెల్యేలు, ప్రధానంగా రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ సహకారం మర్చిపోలేనిదన్నారు. అందరి సహకారంతో మూడేళ్ల పీఆర్‌పీ అందజేసేందుకు హామీ ఇచ్చారని, దీపావళి పండుగలోగా అధికారులకు పీఆర్‌పీ అందుతుందని తెలిపారు. అధికారుల సమస్యల పరిష్కారం కోసం త్వరలో స్ట్రక్చరల్ సమావేశం నిర్వహించేందుకు యాజమాన్యం అంగీకరించిందని అన్నారు. డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ త్వరలో అందజేయాలని యాజమాన్యాన్ని కోరామని, డిసెంబర్‌లోగా ఈప్రక్రియ పూర్తవుతుందని ఆయన చెప్పారు.


