పొదుపు చర్యలపై ఎన్‌పీడీసీఎల్‌ ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

పొదుపు చర్యలపై ఎన్‌పీడీసీఎల్‌ ప్రత్యేక దృష్టి

Oct 22 2026 11:51 PM | Updated on Oct 22 2026 11:51 PM

విద్యుత్‌ సరఫరా, వినియోగంలో ఖచ్చితత్వం వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు డిజిటల్‌ సాంకేతిక విధానంతో నష్టాల గుర్తింపు

రామగుండం: విద్యుత్‌ సరఫరాలో పొదుపు చర్యలపై ఎన్‌పీడీసీఎల్‌ ప్రత్యేక దృష్టి సారించింది. మారుతున్న డిజిటల్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ విద్యుత్‌ సరఫరా, వినియోగంలో ఖచ్చితత్వాన్ని పాటిస్తూ వినియోగదారులకు మరింత వేగవంతంగా మెరుగైన సేవలు అందిస్తూ నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.. ఇందులో భాగంగానే విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ ఉద్యోగుల్లో సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించడం, ఉద్యోగుల సేవలు, వినియోగదారుల అవసరాలపై సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకునే విధంగా ఉద్యోగులు తమ పనితీరును మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఇటీవల సూచించిన తెలంగాణ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్‌మిత్తల్‌ ఆదేశాలకు అనుగుణంగా కసరత్తు ప్రారంభించింది.

చేపట్టిన చర్యలు

డేటా అనలిటిక్స్‌: విద్యుత్‌ పంపిణీ వ్యవస్థలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)తో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం. విద్యుత్‌ చౌర్యం, తక్కువగా విద్యుత్‌ బిల్లింగ్‌ చేయడం, విద్యుత్‌ లైన్లపై అదనపు లోడ్‌ను తగ్గించడం తదితర చర్యలను ఆధునిక డేటా అనలిటిక్స్‌ వ్యవస్థను వినియోగించుకోవడం.

వ్యవస్థను పటిష్ట పర్చడం: ఏఐ ఇంటిగ్రేషన్‌లో భాగంగా విద్యుత్‌ సరఫరా వ్యవస్థను పటిష్టం చేయడానికి, సేవల్లో నాణ్యతను మరింత పెంచడానికి ఆపరేషన్‌ విభాగంలో ఏఐ సాంకేతికతను జోడించడంపై ప్రత్యేక దృష్టి.

వినియోగదారులకు డిజిటల్‌ సేవలు: విద్యుత్‌ వినియోగదారుల సమస్యలను శరవేగంగా, పారదర్శకంగా పరిష్కరించేందుకు ఇప్పటికే వాట్సాప్‌ ఛాట్‌బాట్‌ యాప్‌ను పరిచయం చేయగా దాని పనితీరును సమీక్షిస్తున్నారు.

ఉద్యోగులకు డిజిటల్‌ సపోర్ట్‌: విద్యుత్‌ ఉద్యోగులు తమ సర్వీసు సమస్యల పరిష్కారం నిమిత్తం కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా బాట్‌ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఉద్యోగుల విభాగాల వారీ సమస్యలను పారదర్శకంగా పరిష్కరించడానికి దోహదపడుతుంది.

వినియోగదారులకు నాణ్యమైన, భద్రతతో కూడిన సేవలు: అత్యవసర సమయాల్లో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ నిమిత్తం 108 తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా పవర్‌ అంబులెన్స్‌ సేవలు విస్తరించే విధంగా సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు కార్యాచరణ కొనసాగుతుంది.

వినియోగదారులకు పారదర్శక సేవలు: ఫీల్డ్‌ సిబ్బంది వాహనాలకు జీపీఎస్‌ ట్రాకింగ్‌ ఏర్పాటు చేయడం ద్వారా వినియోగదారుల ఫిర్యాదులపై త్వరగా స్పందించే వ్యవస్థను పరిశీలిస్తున్నారు. సాంకేతికత ఆధారంగా విద్యుత్‌ అంతరాయం జరిగిన తీరు, ప్రాంతం, పునరుద్ధరించాల్సిన సేవలతో వినియోగదారుల విశ్వాసాన్ని పొందవచ్చు. రాబోయే రోజుల్లో ప్రతీ ఉద్యోగి సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవడం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement