మెరుగైన వైద్య సేవలందించాలి | - | Sakshi
Sakshi News home page

మెరుగైన వైద్య సేవలందించాలి

Oct 22 2026 11:51 PM | Updated on Oct 22 2026 11:51 PM

● మందులు, పరీక్షల కిట్లు అందుబాటులో ఉంచాలి ● కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి: ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం సుల్తానాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి వివిధ విభాగాలను పరిశీలించి ఓపీ సేవలు, మందుల నిల్వలు, వైద్య పరీక్షల నిర్వహణ, పరిసరాల పరిశుభ్రతపై ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. మందులు, వైద్య పరీక్షల కిట్లను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుకోవాలని, నిల్వలు తగ్గకముందే ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సంబంధిత వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలి

రైస్‌ మిల్లుల నుంచి రావాల్సిన బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ బి.శ్రీరాములుతో కలిసి సంబంధిత రైస్‌ మిల్లర్లు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. బకాయిలు చెల్లించని డిఫాల్టర్‌ రైస్‌ మిల్లర్ల ఆస్తులు, బ్యాంకు ఖాతాలను గుర్తించాలని ఆదేశించారు. రెండు, మూడు రోజుల్లోగా బకాయిలు చెల్లించని పక్షంలో రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం నిబంధనలకు అనుగుణంగా సంబంధిత రైస్‌ మిల్లుల ఆస్తులు, బ్యాంకు ఖాతాలను సీజ్‌ చేయాలని తెలిపారు. జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనాథ్‌, జిల్లా మేనేజర్‌ శ్రీకాంత్‌, డీసీవో శ్రీమాల, ఆర్డీఓ గంగయ్య, తదితరులు పాల్గొన్నారు.

పేదల పక్షాన పోరాడిన నాయకుడు

పండుగ సాయన్న

పేద ప్రజల పక్షాన నిలిచి, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన ప్రజా నాయకుడు పండుగ సాయన్న అని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. పండుగ సాయన్న జయంతి సందర్భంగా సోవమారం కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. నిజాం పాలనలో ప్రజలను దోపిడీ చేస్తున్న దొరలు, దేశ్‌ముఖ్‌లు, అధికారులు, సంపన్నులకు వ్యతిరేకంగా పండుగ సాయన్న పోరాటం చేశారని అన్నారు. బీసీ డెవలప్‌మెంట్‌ అధికారి రవీందర్‌, జిల్లా సహకార అధికారి శ్రీమాల, కలెక్టరేట్‌ ఏవో బండి ప్రకాశ్‌, వివిధ శాఖల అధికారులు, బీసీ సంఘాల భూతగడ్డ సంపత్‌, బీసీ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు తాడూరి శ్రీమాన్‌, నూనె పరమేశ్వర్‌, గానబోయిన రాజేందర్‌, గోస్కు లింగన్న, నక్క సతీశ్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement