రామగుండం: ఎల్లంపల్లి ప్రాజెక్టులో సమృద్ధిగా నీరు ఉండడంతో శుక్రవారం రాత్రి నీటిపారుదలశాఖ అధికారులు బ్రాహ్మణపల్లి/రామగుండం ఎత్తిపోతలు ప్రారంభించి 69 క్యూసెక్కుల నీటిని వదిలారు. 27ఎల్ కాలువ ద్వారా అంతర్గాం మండలంలోని చివరి ఆయకట్టుకు నీటి సరఫరా ప్రారంభమవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే మక్కాన్సింగ్ఠాకూర్కు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఇటీవల సాగునీటిని విడుదల చేయాలని, ఒకవేళ నీటి విడుదలపై ఏలాంటి స్పందన రాకుంటే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి సిద్ధమంటూ బీఆర్ఎస్ రాష్ట్ర నేత కౌశికహరి హెచ్చరిక చేసిన విషయం తెలిసిందే. ఏదేమైనా రైతాంగానికి సాగునీరు విడుదల చేసినట్లు ఎమ్మెల్యే పేర్కొంటుండగా, తమ హెచ్చరికలతోనే నీటి విడుదలకు పూనుకున్నారని కౌశికహరి అనుచరవర్గం పేర్కొనడం గమనార్హం.


