గల్ఫ్‌పై ‘మిట్టపల్లి’ బతుకమ్మ పాట | - | Sakshi
Sakshi News home page

గల్ఫ్‌పై ‘మిట్టపల్లి’ బతుకమ్మ పాట

Oct 18 2026 1:48 AM | Updated on Oct 18 2026 1:48 AM

● దుబాయ్‌లో ఆవిష్కరణ

● దుబాయ్‌లో ఆవిష్కరణ

గోదావరిఖని/గోదావరిఖనిటౌన్‌: ‘ఎడారిలో తంగే డు వనమే మొలిసేనో’ అంటూ సాగే బతుకమ్మ పా టని అక్షర గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ జ్యుయలరీ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ చైర్మన్‌ కోట కుమార్‌ (కేకే) రూపొందించగా.. గీతానికి ప్రముఖ తెలంగాణ ప్రజాకవి, గా యకుడు మిట్టపల్లి సురేందర్‌ సాహిత్యాన్ని అందించారు. శనివారం దుబాయిలో ఆవిష్కరించారు. గుండెను తట్టిలేపుతున్న ఈ గేయాన్ని ప్రముఖ సింగర్‌ మంగ్లీ ఆలపించగా నేపథ్య సంగీతం మదీన్‌ ఎస్కే సమకూర్చారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ సందర్భంగా దుబాయ్‌ బతుకమ్మ పాటని గొలుగొండ కోట నుంచి బుర్జు జుఖలీఫా దాకా బతుకమ్మ పాటను పేర్చి మిట్టపల్లి స్టూడియో ద్వారా ఇటు తెలంగాణ అటు గల్ఫ్‌లోని ఆడబిడ్డలకు పాటను అంకితమిచ్చారు అక్షర గ్రూప్స్‌ చైర్మన్‌ కోట కుమార్‌. తెలంగాణ నుంచి తరలివెళ్లిన డప్పు, ఒగ్గుడోలు బృందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దుబాయితో పాటు అబుదబి నుంచి కార్మికులు, కార్మిక కుటుంబాలు హాజరై బతుకమ్మ పండుగని విజయవంతంచేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement