రామగుండం: అంతర్గాం మండలం కుందనపల్లి రైల్వేగేట్ వద్ద వంతెన నిర్మాణంలో భూము లు కోల్పోతున్న వారితో ఆర్డీవో, భూసేకరణాధి కారి గంగయ్య గురువారం సమావేశమయ్యా రు. ఇప్పటికే ఇరవై మంది నుంచి సుమారు 5.175 ఎకరాలు సేకరించామమని, భూముల డాక్యుమెంట్ల జిరాక్స్‌లను తమకు అందజేయా లని కోరారు. వంతెన నిర్మాణంలో నాలుగు స్ట్ర క్చర్లు (నివాసాలు) కోల్పోతున్నట్లు గుర్తించా మని తెలిపారు. తహసీల్దార్ ప్రసాద్, ఆర్ఐ రమేశ్, పంచాయతీ కార్యదర్శి శ్రీలక్ష్మి, జీపీవో పోశం పాల్గొన్నారు. కాగా, నివాసాలు కోల్పోతున్న వారికి పునరావాస ప్యాకేజీ అమలు చే యాలని, ఇళ్లస్థలాలు కేటాయించి, గుంటకు రూ.40 లక్షల పరిహారం చెల్లించాలని, 70శాతం భూములు కోల్పోతున్న వారిలో మిగిలిన భూ ములూ సేకరించాలని నిర్వాసితులు కోరారు. మంథనిరూరల్: వినియోగదారులకు నాణ్యమై న విద్యుత్ అందిస్తున్నామని ట్రాన్స్‌కో డీఈ ప్ర భాకర్ తెలిపారు. ఎగ్లాస్పూర్ ఆపరేషన్ సెక్షన్ కు చెందిన వెంకటాపూర్‌లో 33/11కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో 5ఎంవీఏ సామర్థ్యం గల పవర్ ట్రాన్స్ఫార్మర్ను 8ఎంవీఏకు పెంచి గురువారం చార్జింగ్ చేసి ప్రారంభించారు. డీఈ మాట్లాడు తూ, పెరిగిన విద్యుత్ లోడ్‌కు అనుగుణంగా ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా మెరుగైన విద్యుత్ సరఫరా అవుతుందన్నారు. గోదావరిఖని: పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా రా మగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల యువత, ఔత్సాహిక ఫొటోగ్రాఫర్ల కోసం ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిలిమ్స్ అంశాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు సీపీ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ, సమాజ రక్షణలో పనిచేస్తూ ప్రాణత్యాగం చేసిన పోలీసుల సేవలు, త్యాగాలను స్మరించుకుంటూ ఈనెల 21న చేపట్టే పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నా రు. పోలీసుల సేవలపై రూపొందించిన మూడు ఫొటోలు, మూడు నిమిషాల నిడివికి మించని షార్ట్ ఫిలింను ఈనెల 23లోగా రామగుండం పోలీస్ కమిషనరేట్ స్పెషల్ బ్రాంచ్ కార్యాలయంలో సమర్పించాలన్నారు. 3 ఉత్తమ ఫొటో లు, మూడు ఉత్తమ షార్ట్ ఫిలిమ్స్‌ను రాష్ట్రస్థాయి పోటీలకు పంపించనున్నట్లు వివరించారు.
సీసీ కెమెరాల పాత్ర కీలకం
ధర్మారం: నేరాల నియంత్రణ, అసాంఘిక శక్తు ల కదలికలపై నిఘా ఉంచేందుకు సీసీ కెమె రాలు దోహదపడతాయని డీసీపీ రాంరెడ్డినాయ క్ అన్నారు. సాయంపేట సర్పంచ్ కూర శ్రీవాణి ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఏర్పాటు చే సిన 8 సీసీ కెమెరాలను డీసీపీ గురువారం ప్రా రంభించి మాట్లాడారు. ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమన్నారు. ఏసీపీ గజ్జి కృష్ణ, సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై శ్రీకాంత్ ఉపసర్పంచ్ దయ్యాల రజిత పాల్గొన్నారు.
నాణ్యమైన విద్యుత్ సరఫరా
ఫొటోగ్రఫీలో పోటీలు
డీఎంఎల్టీలో ప్రవేశాలు
కోల్‌సిటీ: సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(సిమ్స్–ప్రభుత్వ), రామగుండం ప్రభు త్వ వైద్యకళాశాల (జీఎంసీ)లో 2026–27 వి ద్యా సంవత్సరానికి డీఎంఎల్టీ, డయాలసిస్ పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, ఇంటర్ చదివినవా రు అర్హులని ప్రిన్సిపాల్ దయాళ్‌సింగ్ తెలిపా రు. ఒక్కో కోర్సులో 30 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆసక్తిగలవారు www.tgpmb. telangana.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసు కోవాలని, హార్డ్‌కాపీలను ఈనెల 24లోగా అంద జేయాలని, వివరాలకు www.gmcramagun dam.in వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.
బహుజనుల బతుకమ్మ
పెద్దపల్లి: స్థానిక అయ్యప్పస్వామి ఆలయం వద్ద గురువారం బహుజన బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. అరుణోదయ సాంస్కృతిక స మాఖ్య అధ్యక్షురాలు విమలక్క మహిళలతో కలి సి బతుకమ్మ ఆడారు. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు.