యైటింక్లయిన్కాలనీ: వకీల్పల్లి గనిలో మైనింగ్ సర్ధార్గా పనిచేసి 2024లో ఉద్యోగ వి రమణ పొందిన చిప్ప రాజేశ్వర్–లలిత దంపతులకు ఇ ద్దరు కుమారులు, ఒక కుమా ర్తె సంతానం. కుమార్తె సౌమ్య గురువారం వెలువడిన ఫలితాల్లో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. గతేడాది తెలంగాణలోని 94 జడ్జి పో స్టులకు రాత పరీక్ష నిర్వహించారు. ఈనెల 7న ఇంటర్వ్యూలు నిర్వహించి గురువారం ఫలితాలు విడుదల చేశారు. సౌమ్య జూనియర్ సివిల్ జడ్జి గా ఎంపికయ్యారు. సెక్టార్–3 సింగరేణి పాఠశాలలో టెన్త్, హైదరాబాద్లో ఇంటర్, న్యాయ వి ద్య పూర్తిచేశారు. 2022 నుంచి గోదావరిఖని బా ర్ ఆసోసియేషన్ సభ్యురాలిగా కొనసాగుతున్నా రు. తల్లిదండ్రులు, సోదరుల ప్రోత్సాహంతోనే న్యాయమూర్తిగా ఎంపికై నట్లు సౌమ్య తెలిపారు.


