వీరు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ గ్రామ రైతులు. వరి పంట వేయగా మిడ్ మానేరు గేట్లు ఎత్తినప్పుడు, మానేరువాగులో నీరు నిల్వ ఉన్నంతసేపు మోటార్ల ద్వారా పంటలకు నీరు అందించుకున్నారు. కొద్దిరోజులుగా మిడ్ మానేరు డ్యాం గేట్లు ఎత్తకపోవడంతో మానేరు వాగు ఎండిపోయింది. దీంతో కందికట్కూర్ గ్రామంలో దాదాపు 100 ఎకరాల వరకు సాగునీరు అందక వరిపొలాలు ఎండిపోతున్నాయి. రూ.వేలు ఖర్చుపెట్టి వరి సాగు చేస్తే నోటికి వచ్చే సమయంలో ఎండిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


