జ్యోతినగర్: రామగుండం అభివృద్ధే ధ్యేయమని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ అన్నారు. మేడిపల్లి – పీకే రామయ్యకాలనీ మధ్య ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను మేయర్ మహంకాళి స్వామి, కమిషనర్ అరుణశ్రీతో కలిసి గురువారం ప్రారంభించి మాట్లాడారు. కార్పొరేటర్లు గట్ల రమేశ్, ముస్తఫా, నెలకంటి రాము, వడ్లూరి రవి, నాయకులు ఆసిఫ్ పాషా, అభిషేక్, భరత్ గౌడ్, ఈఈ శాంతిస్వరూప్ పాల్గొన్నారు. అదేవి ధంగా అండర్–17 బాలికల విభాగంలో జాతీ య స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైన కుమ్మరి స్ఫూర్తి ప్రదాయినిని ఎమ్మెల్యే అభినందించారు.


