గురువారం శ్రీ 24 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

గురువారం శ్రీ 24 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

Sep 24 2026 2:42 AM | Updated on Sep 24 2026 2:42 AM

గురువారం శ్రీ 24 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

న్యూస్‌రీల్‌

కన్నుల పండువగా వినాయక నిమజ్జనం ఊరూవాడా ఉప్పొంగిన భక్తిపారవశ్యం గురువారం వేకువజాము వరకూ వేడుకలు వర్షంలోనూ ఆగని ఉత్సాహం

‘ఖని’లో గణపతికి పూజలు చేస్తున్న ఎమ్మెల్యే ఠాకూర్‌ దంపతులు, మేయర్‌ స్వామి, పెద్దపల్లిలో వీడ్కోలు పలుకుతున్న విప్‌ విజయరమణారావు, మున్సిపల్‌ చైర్మన్‌ మల్లయ్య, కమిషనర్‌ వెంకటేశ్‌

యైటింక్లయిన్‌కాలనీలో..

గోదావరిఖని కల్యాణ్‌నగర్‌లో చిన్ని వినాయకుడితో..

వినాయకుడిని నిమజ్జనానికి తీసుకెళ్తున్న చిన్నారులు

ఫొటోలు :

సాక్షి ఫొటోగ్రాఫర్‌, పెద్దపల్లి

పెద్దపల్లి ఎల్లమ్మ– గుండమ్మ చెరువులో వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్న మున్సిపల్‌ సిబ్బంది

గోదావరిఖని ఆర్జీ–1 జీఎం కార్యాలయంలో నీటితొట్టెలో నిమజ్జనం

పెద్దపల్లిలో డప్పు కళాకారుల ఆటాపాటలు

పెద్దపల్లి ఎల్లమ్మ– గుండమ్మ చెరువులో యువకుల కేరింతలు

గోదావరిఖని/పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్‌/మంథని: జిల్లాలోని గోదావరిఖని, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌తోపాటు వివిధ గ్రామాల్లో వినాయక నిమజ్జనం వైభవంగా సాగుతోంది. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా, జిల్లా అధికార యంత్రాంగంతోపాటు పోలీసు బలగాల కనుసన్నల్లో వేడుకలు సాఫీగా సాగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు నిత్యం విశేష పూజలు అందుకున్న విఘ్నేశ్వరుని శోభాయాత్ర సందర్భంగా భక్తులు ‘గణపతి బొప్పామోరియా’ అంటూ చేసిన నినాదాలు మార్మోగుతున్నాయి. గణపతి మండపాల వద్ద మహిళా భక్తులు స్వామివారికి హారతులు ఇచ్చి ‘బైబై గణేశా.. మళ్లీ రావయ్యా’ అని సాగనంపుతున్నారు. పెద్దపల్లిలో ఎల్లమ్మ – గుండమ్మ చెరువు, గోదావరిఖని, మంథని తీర ప్రాంతాల్లో గోదావరి నదిలో విఘ్నేశ్వరుని విగ్రహాలు నిమజ్జనం చేస్తున్నారు. బుధవారం సాయంత్రం ప్రారంభమైన నిమజ్జన వేడుకలు గురువారం వేకువజాము వరకూ కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవైపు భారీ వర్షం కురుస్తున్నా, ఇబ్బందులు ఎదురవుతున్నా స్వామివారి శోభాయాత్ర కొనసాగించారు. పోలీసు యంత్రాంగం పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement