ధర్మారం: జిల్లాలో బుధవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం కురిసింది. తొమ్మిది రో జులపాటు నిత్యపూజలు అందుకున్న గణనాథునికి వీడ్కోలు పలికే సమయంలోనే వానదేవుడు గంగ మ్మను తోడ్కొని రావడంతో శోభాయాత్రకు కాస్త ఆటంకం కలిగింది. లోతట్టు ప్రాంతాలు జలమ యం కాగా, రోడ్లపై వరదనీరు చేరింది. దీంతో భక్తులు, గణేశ్ మండప నిర్వాహకులు నిరాశ చెందినా.. తర్వాత వాన కాస్త తగ్గడంతో ఆటాపాటలతో శోభాయాత్ర నిర్వహించారు.
పడిపోయి చెట్లు..
ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లి గ్రామంలో భారీవర్సం ధాటికి చెట్లు రోడ్డుపై విరిగిపడ్డాయి. స్పందించిన సర్పంచ్ ధార రాజ్‌కుమార్ సిబ్బందితో కలిసి చెట్లు తొలగించారు. దీంతో వినాయక శోభాయాత్ర సాఫీగా సాగింది.
కొత్తగూడెం ఆర్టీవోగా పెద్దపల్లివాసి
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి పట్టణానికి చెందిన పొందుగుల భూషిత్‌రెడ్డి కొత్తగూడెం జిల్లా రవాణ శాఖ అధికారి(ఆర్టీవో)గా బుధవారం ఉద్యోగ బాధ్యత లు స్వీకరించారు. పెద్దపల్లి(మాజీ ఉపసర్పంచ్ భా స్కర్‌రెడ్డి కుమారుడు)కి చెందిన భూషిత్‌రెడ్డి శిక్షణ పూర్తి చేసుకున్నాక బాధ్యతలు స్వీకరించడంపై స్థానికులు తదితరులు అభినందనలు తెలిపారు.


