● సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర్లు ● ప్రారంభమైన రెస్క్యూ పోటీలు
గోదావరిఖని: రెస్క్యూ పోటీల్లో సత్తా చాటి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సంస్థ పేరు నిలబెట్టాలని సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర్లు కోరారు. ఇంటర్ ఏరియా 55వ జోనల్ మైన్స్ రెస్క్యూ పోటీలు స్థానిక మెయిన్ రెస్క్యూ స్టేషన్‌లో బుధవారం ప్రారంభమయ్యాయి. రెండురోజుల పాటు పోటీలు ఉంటాయి. సింగరేణిలోని ఆరు పురుష, రెండు మహిళాజట్లతోపాటు రెండు కోలిండియా జట్లు పాల్గొంటున్నాయి. గురువారం పోటీలు ముగుస్తాయని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమములో డీఎంఎస్ సాగేస్‌కుమార్, ఏఐటీయూసీ అధ్యక్షుడు వి.సీతారామయ్య, ఐఎన్‌టీయూసీ నాయకుడు ధర్మపురి, సీఎంవోఏఐ ప్రధాన కార్యదర్శి నర్సింహులు, ఆర్జీ–2 జీఎం లక్ష్మీపతిగౌడ్, రెస్క్యూ జీఎం శ్రీనివాస్‌రెడ్డి, శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్, కార్పొరేట్ సేఫ్టీ జీఎం కేఎం తివారీ, రీజియన్ సేఫ్టీ జీఎం మల్లయ్య, ఆర్జీ– 3 జీఎం ఎస్.మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.


